నార్త్ ఇండియా నుంచి వచ్చే భామలకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుందని తెలిసిన విషయమే. కావల్సిందల్లా ఇక్కడ ఓ హిట్ పడటమే. ఇందుకు తగ్గట్టు అందం, అదృష్టం ఉంటే టాలీవుడ్ లో అవకాశాలు పట్టేసినట్టే. అలాంటి భామల్లో ముంబయి నుంచి వచ్చిన సురభి కూడా ఉంది. బీరువా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉన్న సురభి తన పర్సనల్ ఫీలింగ్స్, ఇష్టాలను చెప్పుకొచ్చింది. పెళ్లిపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పింది.

IHG

 

తనకు ప్రేమ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే.. ప్రేమ అనేది ఓ మనిషిని చూస్తే ఆటోమేటిక్ గా పుట్టాలి.. ప్రేమించాలి. నన్ను బాగా చూసుకునేవాడై ఉండాలి. సరదాగా ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నా జీవితంలోకి వస్తే ఆనందమే అని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇంట్లో హ్యాపీగా తన హాబీస్ నెరవేరుస్తూనే మళ్లీ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటానా అని ఎదురుచూస్తున్నట్టు కూడా చెప్తోంది. సినిమా అవకాశాలు రావడం కూడా అదృష్టమే అని చెప్తోంది. అయితే.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరిన్ని అవకాశాలు కోసం ఎదురుచూడటమే తమ చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చింది.

IHG

 

సురభి చేసిన సినిమాల్లో సక్సెస్ లు ఉన్నాయి. అవకాశాలు వచ్చాయి గానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ.. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. నానితో చేసిన జెంటిల్ మేన్ హిట్ అయింది. ఒక్క క్షణంలో సురభి నటనకు మంచి మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఆది హీరోగా నటిస్తున్న శశి సినిమా చేస్తోంది. దీంతోపాటు ఓ కన్నడ సినిమాలో కూడా నటిస్తోంది సురభి. ఈ సినిమాలైనా తనకు మరిన్ని అవకాశాలు రప్పిస్తాయని భావిస్తోంది ఈ హిందీ భామ.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: