ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారడంతో దానికి తగినట్టుగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. ఒకప్పుడు రొటీన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు పంథా మార్చుకుని కొత్త కొత్త ప్రయోగాలతో బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా కొత్త దర్శకులు.. కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవడంతో యువ రక్తం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అలంటి పంథాలోనే వస్తున్నా సినిమా ఓ రచయితా ప్రేమకథ.   

 

ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను హరిచందన్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా నాగ వర్మ బైర్రాజు నటిస్తుండగా దివ్యా రావు. సినిమా రచయితా ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చెప్పే కథే మా సినిమా. తన ప్రేమను సాధించడం కోసం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఆ రచయితా ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కు డిఫరెంట్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు డైరక్టర్ హరిచందన్. 

 

సినిమా నుండి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నాగ వర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. కొంతమేరకు టాకీ పార్టీ మినహా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది త్వరలో వెళ్లడిస్తామని అన్నారు నిర్మాతలు. ఈ సినిమాలో ఆదిత్య ఓం, ఖయ్యుమ్, సురేష్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్ వంటి  తదితర తారాగణం నటిస్తున్నారు. సురేష్ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వేణు మురళీధర్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా మరి ఈ సినిమా రైటర్ ప్రేమకథ ఎలా ఉండబోతుందో చూడాలి.             

మరింత సమాచారం తెలుసుకోండి: