ఇండియాలో హీరోయిన్ల పాపులారిటీకి సరిసమానమైన క్రేజ్ సన్నీ లియోన్ సొంతం. ఇండియాలో సన్నీ క్రేజ్ గురించి ఆమె చేసే సినిమాల కంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ చెప్తూంటుంది. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సన్నీ సొంతం. ప్రస్తుతం సన్నీ అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో ఉంది. ప్రస్తుత కరోనా విపత్తులో ప్రపంచ దేశాలను దాటేసి అమెరికా ఎక్కువ ప్రమాదంలో ఉంది. ఈ సమయంలోనే ఆమె అమెరికా వెళ్లింది. తానెందుకు అమెరికా వెళ్లానో, తాను ఏమనుకుంటుందో ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ హాటీ.

IHG

 

లాస్ ఏంజెల్స్ లో డేనియల్ వెబర్ తల్లి ఒక్కరే ఉంటున్నారు. డేనియల్ తండ్రి గతేడాదే చనిపోయారు. ఈ కరోనా విపత్తు సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకే ఇక్కడికి వచ్చాం. ఆమెను ఇక్కడే వదిలేసి మేమే అక్కడే ఉండలేం. నిజానికి నాకు ముంబయ్ వదిలి వెళ్లాలని పించటం లేదు. ఇది తప్పక రావాల్సిన పరిస్థితి. ఇండియా వెళ్లేందుకు అనుమతి ఉన్నా అత్తగారి గురించే ఉండిపోయాను. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎప్పుడు మొదలైతే అప్పుడు ఇండియా వచ్చేయాలని భావిస్తున్నా. ప్రస్తుత ప్రయాణాన్ని నా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆనందంగానే ఉన్నా ముంబయిని మిస్సవుతున్నాను. ప్రస్తుత పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయని ఆశిస్తున్నాను’ అంటూ తన అమెరికా ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది.

IHG

 

ఇటువంటి సమయంలో అమెరికా వెళ్లడం సాహసమే అయినా వెళ్లింది సన్నీ లియోన్. రోజూ వేలల్లో నమోదవుతున్న కొత్త కరోనా కేసులు, వందల్లో మరణాలు, మొత్తంగా లక్షల్లో కరోనా కేసులతో ప్రస్తుతం అమెరికా అల్లాడిపోతోంది. మరోవైపు జాత్యాహంకారంపై జనం రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సన్నీ. అమెరికాలో తాను ఫ్యామిలీతో ఎలా గడుపుతుందో కొన్ని అప్డేట్స్ ఇస్తోంది ఈ హాటీ.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: