తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావా.. తెలుగు భామలకు టాలీవుడ్ లో ఛాన్సులు ఇవ్వరా అంటూ ఒకప్పుడు ఓ వాయిస్ రేజ్ అయ్యేది. అయితే అప్పట్లో లయ, ఆ తర్వాత స్వాతి, ఈషా రెబ్బ లాంటి వారు వచ్చాక తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇస్తారని.. బయట వినిపించేవి అన్ని రూమర్స్ మాత్రమే అని తేలింది. అయినా కూడా ఎక్కడో ఓ చోట తెలుగు భామలకు సరైన ఛాన్సులు రావట్లేదన్నది టాక్. దానికి పర్ఫెక్ట్ ఎక్సామ్ పుల్ గా చెప్పుకుంటే పూజిత పొన్నాడ వస్తుంది. 


అందం, అభినయం ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ఆది లవర్ గా కనిపించిన పూజిత పొన్నాడ సోలో హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. హీరోయిన్ గా చేయకపోగా ఎలాగైనా సినిమాల్లో కనిపించాలని సినిమాల్లో ఎందుకు ఉపయోగపడని పాత్రలు చేస్తూ వచ్చింది. అందుకే ఆమె కెరియర్ ఇలా వెనుక పడ్డది. లేటెస్ట్ తెలుగులో వెబ్ సీరీస్ ల హవా పెరగడంతో ఫెడవుట్, ప్లాప్ లతో వెనుకపడ్డ హీరోయిన్స్ కు ఛాన్సులు వస్తున్నాయి. 


అలాంటి వారిలో పూజిత పొన్నాడ, హెబ్భా పటేల్ లాంటి అందాల భామలు ముందుంటారు. పూజిత ఆల్రెడీ ఆహాలో వస్తున్న ప్రతి వెబ్ సీరీస్ లో, వెబ్ మూవీలో కనిపిస్తుంది. మస్తీ వెబ్ సీరీస్ లో నటించిన ఈ అమ్మడు ఈమధ్యనే రిలీజైన రన్ వెబ్ మూవీలో నటించింది. మరి కేవలం వీటికే పరిమితం అవుతుందా లేక సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటుతుందా అన్నది తెలియాల్సి ఉంది. సరైన ఛాన్స్ రావాలె కానీ ఓ స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ అమ్మడికి ఉంది. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు ఎలా వస్తుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: