ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు సంబంధించినది కామన్ డీపీ ని సోషల్ మీడియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఇది ఒక ట్రీట్ అనే చెప్పాలి. బాలకృష్ణ 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తన సినీ జీవితాన్ని తెలిపే విధంగా ప్రస్తుతం ఈ కామన్ డిపి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 ఇక ప్రస్తుతం దీనిపై ఎంతో మంది సినీ ప్రముఖులు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్పందిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ అల్లుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాలకృష్ణ కామన్ డీపీ  పై స్పందించాడు. బర్త్ డే సందర్భంగా  మామయ్య కామన్ డీపీ విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ నారా లోకేష్ తెలిపారు. ఏ మాన్ విత్ గోల్డ్ హార్ట్ అంటూ తెలిపాడు నారా లోకేష్. అంతేకాకుండా కల్యాణ్ రామ్  సతీమణి నందమూరి బాలకృష్ణ కోడలు స్వాతి కూడా మామయ్య నందమూరి బాలకృష్ణ కామన్ డిపి పై స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. నందమూరి బాలకృష్ణ గారి  కామన్ డిపి వచ్చేసింది అంటూ ఒక పోస్టు పెట్టింది నందమూరి స్వాతి. ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా బాలయ్య సిడిపి ని పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 


 ఇక నందమూరి  అభిమానులు అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే నందమూరి  అభిమానులకు ఎన్నో రోజుల నుంచి నందమూరి హీరోల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి అప్డేట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసినప్పటికీ నందమూరి అభిమానులకు నిరాశ ఎదురైంది. కానీ నందమూరి బాలకృష్ణ బర్త్ డే కొన్ని రోజుల  ముందే మంచి ట్రీట్ అందింది నందమూరి అభిమానులకు. అంతేకాకుండా నందమూరి బాలయ్య బర్త్ డే రోజు సినిమా టైటిల్ తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేస్తున్నారని తెలియడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: