మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు పరిశ్రమలో బడా హీరోల్లో ఒకడు. చిరుత సినిమా తో తెలుగు పరిశ్రమలో హీరోగా అరంగేట్రం చేసిన రామ్ చరణ్ తన మొట్ట మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన చిరుత చిత్రంలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కమర్షియల్ హీరోగా పేరుపొందాడు. మగధీర సినిమా తర్వాత అతని క్రేజ్ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా ధృవ, రంగస్థలం లాంటి ఎన్నో చిత్రాల్లో ఫెంటాస్టిక్ యాక్టింగ్ స్కిల్స్ చూపించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.


ప్రస్తుతం అతను దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం కూడా రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రామ్ చరణ్ హీరో గా దూసుకుపోతూనే మరోవైపు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి.. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాని కూడా తానే తన సొంత బ్యానర్ కింద నిర్మిస్తున్నాడు. 


ఇదే తరహాలో అప్పట్లో అక్కినేని నాగార్జున తన తండ్రి ఏఎన్ఆర్ తో కలిసి సినిమాలు నిర్మించి హిట్టులు సాధించి బాగా లాభాలను ఆర్జించేవాడు. రామ్ చరణ్ లాగానే నాగార్జున సినిమాలు నిర్మించేటప్పుడు తను కూడా హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అతని తర్వాత ఇప్పటి వరకూ ఏ టాలీవుడ్ హీరో తన తండ్రితో కలిసి సినిమాలు నిర్మించలేదు. అలాగే ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూ మరోవైపు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను ఒక్క రామ్ చరణ్ తప్ప ఏ టాలీవుడ్ హీరో నిర్మించలేదు. అందుకే, నాగార్జున తర్వాత ఆ రికార్డును కేవలం రామ్ చరణ్ మాత్రమే సొంతం చేసుకుంటున్నాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: