సోనాక్షిసిన్హా...బాలీవుడ్ అందగత్తె. ముద్దు గుమ్మ. బొద్దు గుమ్మ కూడా. తమిళులు ఎక్కువగా బొద్దు గుమ్మలను ఇష్టపడతారు. అందుకే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన లింగా మూవీలో సోనాక్షిని తెచ్చి నటింపచేశారు. ఆ తరువాత ఆమెను తెలుగులోకి కూడా తెద్దామని అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి కానీ అవి సక్సెస్ కాలేదు.

 

ఇదిలా ఉండగా సోనాక్షిసిన్హాను బాలక్రిష్ణ, బోయపాటి హ్యాట్రిక్ మూవీ మోనార్క్ లో తీసుకోవాలని అనుకున్నారని ప్రచారం అయితే జరిగింది. నిజంగా ఆ చిత్ర యూనిట్ సంప్రదించారో లేదో తెలియదు. అయితే దీని మీద సోనాక్షిసిన్హా కూడా తనను ఎవరూ సంప్రదించలేదని వివరణ ఇచ్చింది కూడా. ఇవన్నీ ఇలా ఉంటే ఎప్పటికప్పుడు టాలీవుడ్లో ఎవరో హీరో పక్కన సోనాక్షిసిన్హా పేరు జత కడుతూ వచ్చారు.

 

ఇపుడు మహేష్ బాబు పక్కన సోనాక్షిసిన్హా నటిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. మహేష్ బాబు కొత్త చిత్రం సర్కార్ వారి పాట పోస్టర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. దానికి చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికైతే ప్రచారంలో ఉన్న పేరు కైరా అద్వానీ. ఆమె మహేష్ తో కలసి చేసిన భరత్ అను నేను సూపర్ డూపర్ హిట్ అయి ఇద్దరిదీ హిట్ పెయిర్ అనేలా పేరు తెచ్చింది.

 

 

ఇపుడు మరో మారు ఆమెను మహేష్ తో కలిపి ఈ సినిమాకు అందం అద్దాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోందిట. అయితే దానితో పాటే కొత్తందాన్ని తెస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది అంటున్నారు. ఆ పేరే సోనాక్షిసిన్హా అంటున్నారు. ఆమెని మహేష్ బాబు పక్కన తెస్తే బాగుంటుంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో కాఈ సోనాక్షిసిన్హా కనుక మహేష్ పక్కన నటిస్తే ఈ మూవీ మరింతగా హైప్ క్రియేట్ అయి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంటుందనడంలో సందేహం లేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: