బిడ్డ పుట్టినప్పుడు కాదు.. ప్రయోజకులు అయినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం అంటారు. ఇందులో ఎంతో నిజం ఉంది. తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే. టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రస్తుతం అలాంటి అనుభూతినే పొందుతున్నాడు. తన గారాలపట్టీ ‘హియ దాసరి’ ఫొటోగ్రఫీలో ప్రతిభ చూపడం మారుతికి అమితానందాన్ని ఇస్తోంది. కారణం.. హియ తీసిన ఫొటోకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కడమే. చిన్న వయసులోనే తన కుమార్తె ఇలా అంతర్జాతీయ ప్రశంసలు దక్కించుకోవడంతో తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్లర్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

IHG

 

‘నా కుమార్తె హియ తీసిన ఒక ఫొటోను ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జాన్ విక్ డీఓపీ డాన్ లాసన్ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని డాన్ తన ఇన్ స్టాలో మెసేజ్ చేశారు. హియ తండ్రిగా నాకెంతో గర్వంగా ఉంది. ఈ ఫొటోను కేవలం సెల్ ఫోన్ లైట్ ఉపయోగించి తీసింది. ఈ పిక్ ను సోనీ అల్ఫా ఎ6600 గోడోక్స్ ఫ్లాష్ తో తీసింది.’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. హియ చదువుతో పాటు ఫొటోగ్రఫీలో కూడా శిక్షణ తీసుకుంటోంది. దీంతో తాను తీసిన పలు ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

IHG

 

డార్క్ లైట్ లో తీసిన ఆ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. హియ ప్రతిభను సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ మెసేజెస్ వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రామిసింగ్ డైరక్టర్లలో మారుతి పేరు కూడా ఉంటుంది. తనదైన స్టైల్లో సినిమాలు తీసే మారుతి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించడంతో ఆరితేరాడు. కామెడీ టైమింగ్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా సాయి తేజ్ తో తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: