థియేటర్లు, టివిలు కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వచ్చింది. ముందు ఎవరు మొదలు పెట్టారన్నది పక్కన పెడితే ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ లో అమెజాన్ ప్రైమ్ నంబర్ 1గా ఉందని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్  బాగా పాపులర్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ మాత్రం ఇండియాలో చాలామంది సబ్ స్క్రైబర్స్ సాధించింది. అయితే నెలకు 129.. సంవత్సరానికి 999 రూపాయలతో అమెజాన్ ప్రైమ్ కొన్న ప్రతి సినిమాను చూసేందుకు వీలు కల్పిస్తారు. అంతేకాదు ప్రైమ్ ఒరిజినల్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది.

 

సినిమాలను కొనేందుకు.. వెబ్ సీరీస్ ప్రొడ్యూస్ చేసినందుకు అమెజాన్ ప్రైమ్ భారీగానే వెచ్చిస్తుంది. అయితే దీనికి తగినట్టుగా సబ్ స్క్రైబర్స్ గాని.. రెన్యూవల్స్ గాని జరగట్లేదట. అందుకే కొత్తగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ కోసం పే పర్ వ్యూని ఇంట్రడ్యూస్ చేస్తున్నారట. ఇప్పటికే యూట్యూబ్ పే పర్ వ్యూ స్టార్ట్ చేసింది. మిగతా ఓటిటి వాళ్ళు సబ్ స్క్రైబర్స్ తో పాటుగా పే పర్ వ్యూ ని మొదలు పెట్టారు. లేటెస్ట్ గా ఆర్జీవీ కూడా క్లైమాక్స్ సినిమాను పే పర్ వ్యూగా ఆర్జీవీ వరల్డ్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నాడు.

 

అందుకే అమెజాన్ ప్రైమ్ కూడా త్వరలో పే పర్ వ్యూ మొదలు పెట్టబోతుందని తెలుస్తుంది. అయితే ఇది అన్ని సినిమాలకు కాదట. స్టార్ సినిమాలకు మాత్రమే పే పర్ వ్యూ ఉంటుందని తెలుస్తుంది. అయితే మిగతా వాళ్ళలా 50, 100 రూపాయలు అని కాకుండా 20, 30 రూపాయలతో పే పర్ వ్యూ ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ ఈ కొత్త స్టెప్ ఆడియెన్స్ కు షాక్ ఇచ్చేలా ఉంది. పే పర్ వ్యూ పెడితే మాత్రం ప్రైమ్ లో కూడా సబ్ స్క్రైబర్స్ తగ్గే అవకాశం లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: