'పెళ్లయిన కొత్తలో' సినిమాతో 15 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియమణి. మొదటి సినిమాతోనే అదిరిపోయే విజయాన్ని సాధించిన ప్రియమణి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో 'యమదొంగ' సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించడం జరిగింది. ఐదారు సంవత్సరాల క్రితం చేతినిండా సినిమాలు కలిగి ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు కలిగి ఉండేది. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

IHG

ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్ తో వెబ్ సిరీస్ తో రాణిస్తూ తెలుగులో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అవకాశాలు దక్కించుకొంది. అందులో ఒకటి ‘నారప్ప’ ఇంకోటి ‘విరాటపర్వం’. ఇటీవల ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ‘విరాటపర్వం’ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భారతక్క అనే నక్సలైట్ క్యారెక్టర్ చేస్తోంది. అసలు మామూలుగా ఈ సినిమాలో ప్రియమణి నటిస్తోందని ఎవరికి తెలియదు.

IHG

ఒక్కసారిగా ‘విరాటపర్వం’ సినిమా యూనిట్ ప్రియమణి పిక్చర్ రిలీజ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు రానా, సాయి పల్లవి క్యారెక్టర్లకు దీటుగా ప్రియమణి క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. మరో పక్క వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ లో కూడా ప్రియమణి నటిస్తోంది. కాగా చాల లాంగ్ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి అదిరిపోయే క్యారెక్టర్లతో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ప్రియమణి పిక్స్ చూసి పొగడ్తలతో నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పవర్ ఫుల్ క్యారెక్టర్ లు ఛాన్స్ కొట్టేసినా ప్రియమణి అదే రీతిలో హిట్ కొట్టు 'అల్ ది బెస్ట్' అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: