కోలీవుడ్ లో ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా రానున్న చిత్రం మాస్టర్. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా కావడం దానికి తోడు మరో స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా నటించడం తో మాస్టర్ పై భారీ అంచనాలు వున్నాయి. మార్చి లోనే ఈసినిమా షూటింగ్ పూర్తి కాగా ఏప్రిల్ లోనే విడుదలకావాల్సి వుంది కానీ కరోనా వల్ల వాయిదాపడింది. ఇంతలో ఓటిటి సంస్థల కన్ను ఈసినిమా పై పడింది. థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం నిర్మాతతో చర్చలు జరిపాయి.
 
ఇందుకోసం ఊహించని స్థాయిలో భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాయి. ప్రధానంగా నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ ,మాస్టర్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం 150 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాయట అయినా కూడా  నిర్మాత ఏమాత్రం ఆసక్తిగా చూపించలేదట. ఎందుకంటే  విజయ్ మార్కెట్ 250 కోట్ల పైనే దానికి తోడు షూటింగ్ మొదలు కాకముందే మాస్టర్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు. అదీగాక డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అంటే విజయ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు.. వీటన్నింటి మధ్య నిర్మాత నో చెప్పాడట. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ సినిమా ను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.
 
దీపావళికి ఈసినిమా థియేటర్లలోకి వచ్చేలా వుంది. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిచాడు. తెలుగులో కూడా ఈసినిమా పై మంచి అంచనాలు వున్నాయి. మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను మహేష్ ఎస్ కోనేరు దక్కించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: