మీ మొబైల్ నుండి ఎవరికైనా ఈ లాక్ డౌన్ కాలం లో ఫోన్ చేసినట్లయితే వారి మొబైల్ రింగ్ అయ్యేందుకు ముందుగా మనకి కరోనా టోన్ వినిపిస్తుంది. అందులో ఈ కోవిడ్-19 నుండి మనల్ని కాపాడేదిడాక్టర్లు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు అని వారిని రక్షణ కవచాలుగా చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ఈ మహమ్మారి తో మన కన్నా ముందు ఉండి ఎక్కువగా పోరాడుతుంది వైద్యసిబ్బంది. అయితే చివరికి వారు కూడా ఈ వైరస్ బారిన పడుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీ లోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఏకంగా 480 మంది వైద్య సిబ్బందికి కరోన్ వైరస్సోకడం ఇప్పుడు దేశంలో కలకలం రేపింది.

 

ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఎయిమ్స్ ఆస్పత్రిలో ముగ్గురు చనిపోగా వారిలో ఒకరు హాస్పిటల్ శానిటేషన్ విభాగంలోని ఉన్నతాధికారి కాగా మరొకరు ఆసుపత్రి మెస్ లో పనిచేసే ఉద్యోగి. దీంతో ఈ ఉదంతంఅన్నీ ఆస్పత్రుల్లో డేంజర్ బెల్ మోగిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉస్మానియా ఆసుపత్రిలో 10 మంది మెడికోస్ కు వైరస్ సోకింది. మరో 280 మంది వైద్య విద్యార్థులను వారి క్వారంటైన్ కుతరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులకే రక్షణ లేని దేశంలో ఇక ఈ వైరస్ వ్యాప్తిని ఎలా అదుపు చేయగలరు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

 

పిపిఈ అందిస్తునా…. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అంతమందికి వైరస్ ఎలా సోకింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్నిప్రశ్నించింది.  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పరీక్షల నిర్వహణ అంశంపై రిటైర్డ్ డీఎంహెచ్ ఓ రాజేందర్ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టుగురువారం విచారణ చేపట్టింది. డిల్లీ ఎయిమ్స్లో వైరస్ బారిన పడిన 480 మంది సిబ్బందిలో 19 మంది డాక్టర్లు 38 మంది నర్సులు 74 మంది సెక్యూరిటీ గార్డులు 75 మంది ఆస్పత్రి అటెండర్లు 54 మందిశానిటేషన్ సిబ్బంది 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు.

 

ఇలా దేశవ్యాప్తంగా వైద్యులంతా వైరస్ బారిన పడుతుంటే…. వారిని అసలు పట్టించుకునేది ఎవరిని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వారు కూడా కరువైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: