జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు మాత్రమే కాకుండా ఈసారి బాలయ్య షష్టిపూర్తి వేడుకలు. వాస్తవానికి కరోనా సమస్యలు లేకుండా ఉండి ఉంటే నందమూరి అభిమానులు అంబరాన్ని అంటేలా ఈవేడుకలను చాలఘనంగా చేసి ఉండేవారు. అయితే కరోనా బాలయ్య అభిమానుల ఉత్సాహాన్ని నీరు కార్చింది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం బాలకృష్ణతో మూవీ చేస్తున్న బోయపాటి ఈమూవీ ఫస్ట్ లుక్ ను బాలయ్య షష్టిపూర్తి సందర్భంగా జూన్ 10న విడుదల చేద్దామని చేస్తున్న ప్రయత్నాలకు బాలయ్య నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


దీనికికారణం ప్రస్తుతం జనం అంతా కరోనా పరిస్థితులు వల్ల రకరకాల బాధలతో ఉన్నప్పుడు తన సినిమా ఫస్ట్ లుక్ సంబరాలు ఏమిటి అంటూ బాలయ్య బోయపాటి ఆలోచనలను తిరస్కరించినట్లు టాక్. అంతేకాదు తాను కూడ తన షష్టిపూర్తి వేడుకలను ఏమి జరుపుకోవడంలేదని కేవలం ఆరోజు తన కుటుంబ సభ్యులతో మాత్రమే కాలం గడుపుతూ తన పుట్టినరోజును చేసుకోబోతున్నట్లు వివరించినట్లు తెలుస్తోంది.


అంతేకాదు తన షష్టిపూర్తి సందర్భంగా ఎటువంటి హడావిడి చేయవద్దని తన అభిమానులకు ఇప్పటికే తాను సంకేతాలు ఇచ్చానని కరోనా సమయంలో ఇలాంటి హడావిడి తనకు నచ్చదు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ లీకులు బయటకు రావడంతో బాలయ్య పుట్టినరోజునాడు బోయపాటి మూవీ ఫస్ట్ లుక్ ఉండదు అన్న క్లారిటీ వస్తోంది. ఈవిషయాలను తెలుసుకుని బాలయ్య అభిమానులు నిరుత్సాహ పడుతుంటే మరికొందరు మరోవిధంగా కామెంట్స్ చేస్తున్నారు.


కరోనా సమస్యతో లాక్ డౌన్ మొదలు అయ్యాక చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అనేక ఫోటోలను షేర్ చేస్తూ మీడియాలో తన హడావిడి కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి ఈ లాక్ డౌన్ పిరియడ్ లో సోషల్ మీడియాలో చిరంజీవి చేసినంత సందడి మరే హీరో చేయలేదు. అదేవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మేకర్స్ లాక్ డౌన్ ప్రారంభం అయ్యాక చరణ్ పుట్టినరోజునాడు ‘ఆర్ ఆర్ ఆర్’ లోని చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియోను విడుదలచేసి తెగ హంగామా చేసారు. ఇలా లాక్ డౌన్ కొనసాగుతూ ఉండగానే అనేక సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆ సినిమాలలోని పాటలు విడుదల చేసి ఆసినిమాలలో నటిస్తున్న హీరోల క్రేజ్ పెంచడానికి ఆ సినిమా దర్శక నిర్మాతలు తమవంతు ప్రయత్నాలు చేసారు. అయితే ఇలా ప్రవర్తించకుండా తన పుట్టినరోజునాడు తన సినిమా ఫస్ట్ లుక్ ను కూడ వద్దని బాలయ్య తన తీరు అందరికంటే చాల విభిన్నం అని తెలియచేస్తున్నాడు అంటూ కొందరు బాలయ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: