తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో తెలుగు ప్రజలు కరోనా భయాలతో కంపించి పోతున్నారు. పేరుకు లాక్ డౌన్ కొనసాగుతున్నా ప్రభుత్వాలు అనేక మినహాయింపులు ఇస్తున్న పరిస్థితులలో జనం ధైర్యంగా రోడ్ల పైకి వస్తూ ఉండటంతో కరోనా మరింత ఉధృతం అవుతున్న పరిస్థితులలో ఇప్పట్లో ప్రభుత్వాలు ధియేటర్ల ఓపెనింగ్ కు అనుమతించే పరిస్థితులు లేవు.


అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు మాత్రం ఏక్షణం ధియేటర్లు ఓపెన్ అయినా వెంటనే ధియేటర్లలో వాలిపోవడానికి వారి సినిమాలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడ పూర్తి చేసుకుని అన్నివిధాల రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మధ్యనే ‘అనుష్క’ నిశ్శబ్దం’ తన సెన్సారింగ్ కార్యక్రమాలను కూడ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.


వాస్తవానికి ఈమూవీని ఒటీటీ లో రిలీజ్ చేయడానికి అనేక భారీ ఆఫర్లు వచ్చినా ఈమూవీ నిర్మాతలు మాత్రం ధియేటర్లలో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ‘నిశ్శబ్దం’ మూవీని ఈమధ్య పూరి జగన్నాథ్ కోసం ప్రత్యేకంగా షో వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక షోకు అనుష్క కూడ వచ్చినట్లు టాక్.


ఈ సినిమాను పూర్తిగా చూసిన తరువాత పూరి జగన్నాథ్ ఈ సినిమా నిర్మాతలకు ధైర్యం చెపుతూ ఎట్టి ఈ మూవీని ఒటీటీ సంస్థలు ద్వారా విడుదల చేయవద్దని ఈ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అయి తీరుతుందని పూరి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అనుష్క కు కూడ పూరి చెప్పిన సలహా నచ్చడంతో ఇంత కాలం వేచి చూసాము కాబట్టి మరో రెండు నెలలు ధియేటర్లు తెరవడం కోసం వేచి చూద్దామని ఈ మూవీ నిర్మాతలకు సద్దిచెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఒక జాతీయ మీడియా సంస్థ ఇండియాలో ధియేటర్లు తెరుచుకోవడం డిసెంబర్ వరకు సాధ్యపడదు అన్న ఊహాగానాలు చేస్తూ ఉండటంతో ఈ మూవీ నిర్మాతలు పూర్తి అయోమయ పరిస్థితులలో ఉన్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: