తెలుగు సినిమాల లో వాన పాటలను రకరకాల సిచ్యువేషన్ లలో వాడుతుంటారు. ఎక్కువగా రొమాంటిక్‌ సిచ్యుయేషన్‌ లోనే వాడినా.. కొన్ని సందర్భాల్లో మిగతా ఎమోషన్స్ కోసం కూడా వాన సాయం తీసుకుంటారు మేకర్స్. అలాంటి ఓ ఇంట్రస్టింగ్‌ సిచ్యుయేషన్ ‌లో అతనొక్కడే సినిమా లోనిది. ఈ సినిమా లో హీరో హీరోయిన్ల పరిచయగీతానికి వాన పాట నేపథ్యం తీసుకున్నాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూపించేలా ఈ పాటను రూపొందించారు.

 

వానను, వాన లో ఐస్‌ క్రీమ్ తినడాన్ని ఇష్టపడే హీరో హీరోయిన్ల ను ఒకేసారి ఈ పాటతో పరిచయం చేశాడు దర్శకుడు. హీరో కళ్యాణ్‌ రామ్‌, హీరోయిన్ సింధూ తులానీ వేరు వేరు చోట్ల వాన లో డ్యాన్స్ చేస్తున్నా.. ఆ రెండు సన్నివేశాలను తెర మీద కలిపి చూపించిన విధానం సూపర్బ్ అనిపించేలా ఉంటుంది. అందుకే ఆ పాట అప్పట్లో సూపర్‌ హిట్ కావటమే కాదు. ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది.

 

మణిశర్మ స్వరాలందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యమందించగా టిప్పు, సునీత లు ఆలపించారు. ఇక అతనొక్కడే సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ కెరీర్‌ లో తొలి సూపర్ హిట్ ‌గా నిలిచిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. సురేందర్ రెడ్డి తొలి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో హీరోగా కళ్యాణ్ రామ్‌ కెరీర్‌ సెటిల్‌ అయిపోగా దర్శకుడిగా సురేందర్‌ రెడ్డి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ బూస్ట్‌ను కళ్యాణ్ రామ్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. తరువాత మరో హిట్ కోసం ఈ నందమూరి హీరో చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: