మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో... మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం అతడు. ఈ సినిమా విడుదల అయిన సమయంలో హాల్ లో పెద్దగా ప్రేక్షకులను ఆకాట్టుకోలేదు గాని ఆ తర్వాత మాత్రం టీవీ లో సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. సినిమాలో ఉండే సన్నివేశాలు సినిమా కథ అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. చివరి వరకు కూడా ఏదో అవుతుంది అనే విధంగా ఉన్నాయి కొన్ని కొన్ని సన్నివేశాలు. 

 

ఇక మహేష్ బాబు కూడా ఆ సినిమాలో మంచి నటన చూపించాడు అనే చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆ సినిమా హిట్ అయింది. మహేష్ కెరీర్ లో అత్యుత్తమ సినిమాల్లో అది కూడా ఒకటి. ఇక ఆ సినిమాలో పాటల విషయానికి వస్తే ప్రతీ పాట కూడా చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు. టైటిల్ సాంగ్ నుంచి ప్రతీ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక అది అలా ఉంటే ఆ సినిమాలో వాన పాట ఒకటి ఉంది. దానికి మంచి స్పందన వచ్చింది.  పిల్ల గాల్లి అనే పాటలో త్రిష వేసిన డాన్స్ కి యూత్ ఫిదా అయిపోయారు. 

 

లంగా ఓణీ తో ఆ పాటలో ఆమె కనపడింది. ఇక ఆ పాటలో ఉండే కొన్ని కొన్ని సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు మంచి హిట్ లేక. ఆ తర్వాత చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కాని ప్రయోగాలు మాత్రం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: