మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా టీవీ లో వస్తే కచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తారు జనాలు. ఇక ఆ సినిమా కథ తో పాటుగా వెంకటేష్ నటన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఆ సినిమా చాలా రోజులు ఆడింది కూడా అప్పట్లో. ముఖ్యంగా ఆ సినిమా కథ ప్రధాన  బలం అయితే కామెడి రెండో బలం అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంటుంది. 

 

ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అయితే ఆ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే పని మానుకుని మరీ చూసే విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆ సినిమాతో వెంకటేష్ యూత్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఇక ఆ సినిమాలో సునీల్ కామెడి కూడా బాగా ఆకట్టుకుంది.  మంచి టైమింగ్ తో సునీల్ ఆ సినిమాలో కామెడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆ సినిమాలో ఉండే పాటలకు కూడా మంచి ఆదరణ వచ్చింది అని చెప్పవచ్చు. ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో. అవి ఇప్పటికి కూడా ఏదోక ఇంట్లో వినపడుతూనే ఉంటాయి అని చెప్పవచ్చు. 

 

ఆ సినిమాలో ఉండే వర్షం సాంగ్ ఒకటి ఉంది. ఒక్కసారి చెప్పలేవా అనే పాటకు మంచి ఆదరణ వచ్చింది. ఆ పాటలో ఆర్తి అగర్వాల్ తో పాటుగా వెంకటేష్  హావ భావాలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ వెనకడుగు వేసింది అని అంటారు సినీ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: