మన తెలుగులో తమిళ సినిమాలకు ముందు నుంచి కూడా మంచి ఆదరణ అనేది ఉంటుంది. సినిమాలను కచ్చితంగా తెలుగులో ఆదరిస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాల్లో ఉండే పాటలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. కచ్చితంగా టీవీ లో వస్తే చూడటమా లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో చూడటమా అనేది ఏదొకటి జరుగుతూనే ఉంటుంది. ఇక కొంత మంది హీరోల సినిమాలకు మన తెలుగులో ప్రత్యేక ఆదరణ అనేది ఉంటుంది. కార్తీ సినిమాలను బాగానే ఆదరించారు మన తెలుగులో. అతని సినిమాల్లో ఉండే పాటలు కూడా ఇక్కడ బాగానే హిట్ అయ్యాయి అని చెప్పవచ్చు. 

 

అతను హీరోగా తమన్నా హీరోయిన్ గా వచ్చిన ఆవారా సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా కథ ఎలా ఉన్నా సరే మన ప్రేక్షకులు కాస్త భిన్న౦గా ఉండటం తో ఆదరించిన పరిస్థితిని మనం చూసాం. ఇక ఆ సినిమాలో వానలో వచ్చిన పాట ఒకటి ఉంది. అరెరే వాన అంటూ వచ్చిన ఆ పాట బాగా హిట్ అయింది. ఆ పాటలో తమన్నా అందాలే కాదు ఆ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. పాటలో మంచి అర్ధం కూడా ఉంటుంది. ఆ పాట ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. 

 

సినిమా హిట్ అవ్వడానికి ఆ పాట కూడా ఒక కారణం అని అంటారు కొందరు. ఆ విధంగా ఆ పాట హిట్ అయింది ఆ సినిమాలో. ఇక ఆ సినిమా తర్వాత కార్తీ సినిమాల కు మన తెలుగులో మంచి డిమాండ్ వచ్చింది. కొనుగోలు చేసిన వాళ్ళు కూడా అతని సినిమాల మీద ఎక్కువ గా ఫోకస్ పెట్టి కొనుగోలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: