దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీకి శని పట్టినట్టే ఉంది.  ఓ వైపు షూటింగ్స్ ఆగిపోయాయి.. రిలీజ్ లు వాయిదా పడ్డాయి.  థియేటర్లు, మాల్స్ బంద్ అయ్యాయి.  ఇది చాలదన్నట్లు కరోనా వైరస్ ప్రభావం బాలీవుడ్ లో ఎక్కువ పడింది.  గత నెల ప్రముఖ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ మద్య మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కరోనాతో కన్నుమూశారు. నటి ఖుష్బు వొదిన కరోనాతో కన్నుమూసింది.  తాజాగా   బాలీవుడ్ నిర్మాత అనీల్ సూరి (77)క‌న్నుమూశారు. దాంతో బాలీవుడ్ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. 

 

ఈ సందర్బంగా  అనీల్ సోద‌రుడు , నిర్మాత రాజీవ్ సూరీ మాట్లాడుతూ.. అనీల్ జూన్ 2 నుండి హై ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. త‌ర్వాతి రోజు నుండే అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి పూర్తిగా క్షీణించింది. వెంట‌నే లీలావ‌తి, హిందూజా ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా వారు అడ్మిట్ చేసుకునేందుకు నిరాక‌రించారు అని అనీల్ సోద‌రుడు చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అనీల్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అనీల్‌కి భార్య ఇద్ద‌రు సంతానం ఉన్నారు.

 

 అనీల్ ..  రాజ్‌కుమార్‌, రేఖ కాంబినేషన్‌లో ‘కర్మయోగి’, ‘రాజ్‌ తిలక్‌’ వంటి చిత్రాలు ఇక నిర్మించారు. ఆయ‌న సోద‌రుగు రాజీవ్‌ సూరి .. 1979లో అమితాబ్‌, మౌసమి ఛటర్జీ జంటగా బసు ఛటర్జీ దర్శకత్వంలో ‘మంజిల్‌’ చిత్రం నిర్మించారు. ‘నా అభిమాన దర్శకుడు, మా సోదరుడు ఒకే రోజు కన్నుమూయడం నిజంగా దురదృష్టకరం’ అని పేర్కొన్నారు రాజీవ్‌ సూరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: