అనుష్క శెట్టి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా  కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ బ్యూటికి ఫ్యాన్ ఫాలోంగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చూడగానే ఆకట్టుకున్న ముఖారవిందం ఆమె సొంతం. చెరగని చిరునవ్వు.. చిలిపి కళ్లతో మాయచేసే స్వీటీ అంటే చాలా మందికి ఇష్టం. `సూప‌ర్‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటి.. త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత సినిమాలు చేసింది. అందులో బలాదూర్ సినిమా కూడా ఒక‌టి.

IHG

ఉదయ్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో ర‌వితేజ, అనుష్క జంట‌గా న‌టించారు. తన అనుకున్న వారు తనని నుమానించి..దూరంచేసుకున్నా ఆ భాధని గుండెలోనే దిగమింగి వారి క్షేమం కోసం అన్ని కష్టాలు, నిష్టూరాలు భరిస్తూ నిరంతరం శ్రమించే హీరో పాత్రలు మనకు కొత్తేం కాదు. తెలుగు సినిమా పుట్టిన నాటినుండి ఈ తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చిన చిత్రమే బలాదూర్‌. ఆ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణ హీరో ర‌వితేజ‌కు పెదనాన్నగా న‌టించ‌డం విశేషం.

IHG

అయితే ఈ సినిమా `రంగు రంగు వాన ఇది నంగణాచి వాన నను ముట్టుకుంటే ముద్దై పోనా`.. అంటూ సాగే వాన సంగా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని చెప్పుకోవాలి. ఈ సాంగ్‌లో త‌డిచిన అందాల‌తో అనుష్క ర‌వితేజ‌తో చ‌ల‌రెగిపోయింద‌నే చెప్పాలి. ఇక ఈ పాట‌లో అనుష్క అందాలు చూసిన‌వారు ఎవ‌రైనా క‌ళ్లు తిప్పుకోలేరు. అంత‌లా అనుష్క త‌న అంద‌చందాల‌తో మ‌తిపోగొట్టింది. ఆ సాంగ్‌లో అనుష్క అందాలు వాన‌నే డామినేట్ చేసిన‌ట్టు అనిపిస్తుంది. ఇక హాటెస్ట్ రెయిన్ సాంగ్స్‌లో అనుష్క, ర‌వితేజ క‌లిసి చిందేసిన ఈ `రంగు రంగు వాన` సాంగ్ ఖ‌చ్చితంగా ముందు వ‌ర‌స‌లో ఉంటుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: