లాక్ డౌన్ పరిస్థితులకు అన్ని వ్యవస్థలతోపాటు సినీ పరిశ్రమ కూడా కుదేలైంది. షూటింగ్స్ నిలిచిపోవడంతోపాటు.. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలూ ఆగిపోయాయి. లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్స్ త్వరలో ప్రారంభమైనా పూర్తైన సినిమాల విడుదలెప్పుడో తెలీని పరిస్థితి. దీంతో కొన్ని సినిమాలో ఓటీటీల్లో విడుదలకు రెడీ అయిపోతున్నాయి. ఇందులో కీర్తి సురేశ్ మెయిన్ లీడ్ లో నటించిన బైలింగ్వల్ మూవీ ‘పెంగ్విన్’ కూడా ఉంది. కొన్ని రోజులుగా ఈ వార్త గాసిప్ గానే ఉన్నా ఇప్పుడు అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.

IHG

 

ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో జూన్ 19న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. సినిమాకు సంబంధించి ట్రైలర్ ను జూన్ 8న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను గత ఏడాది కీర్తి సురేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కు ఇదే తొలి సినిమా. తమిళ్ లో పిజ్జా, జిగర్తాండ, రజినీకాంత్ తో పెట్టా తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ఓ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోందని సమాచారం.

IHG

 

సినిమాలో మేజర్ పార్ట్ అంతా ఊటిలో తెరకెక్కించారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్న తన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కీర్తి సురేశ్ తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపింది. మహానటి తర్వాత కీర్తి నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు తమిళ ఎగ్జిబిటర్లు ఈ సినిమా విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: