మామూలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు అయితే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరో సినిమా వస్తుందంటే సినిమాలోని ప్రతిది కూడా కీలకంగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలోని పాటలు అయితే ఎంతో కీలకం గా మారిపోతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. సినిమాలోని పాటలు సినిమా విజయానికి కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే సాదాసీదా పాటలతో అలరిస్తే ఓకే... అదే పాటలో హీరోయిన్ డాన్స్ ఉంటే అభిమానులు ఎంత పండగ  పండగ చేసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో రైన్ డాన్స్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. నేటి తరం యువ హీరోలు దర్శకులు రైన్ డాన్స్ పై అంతగా దృష్టి పెట్టడం లేదు కానీ అప్పట్లో చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ స్టార్ హీరోలుగా కొనసాగుతూ వారి జనరేషన్ నడుస్తున్న సమయంలో రైన్ డాన్స్ కి  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉండేది. 

 


 ఇక్కడి దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో రెయిన్ డాన్స్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఎందుకంటే అప్పట్లో ప్రేక్షకుల్లో రైన్ డాన్స్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇక స్టార్ హీరోల సినిమా రైన్ డాన్స్ ఉంది అంటే అది సినిమాకు ఎంతగానో కలిసొచ్చే అంశం. అందుకే అప్పట్లో స్టార్ హీరో సినిమా అంటే చాలు అందులో రైన్ డాన్సులు ఉండేవి. ఇక ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో రైన్  డాన్సులు చేసిన విషయం తెలిసిందే. ఎన్నో పాటల్లో  అద్భుతంగా తనదైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతోపాటు హీరోయిన్లతో రొమాన్స్ తో కూడా అదరగొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. 

 


 ఇక చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో బాగా పాపులర్ అయిన రైన్ డాన్స్ ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది.... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నాటి స్టార్ హీరోయిన్ రోజా హీరోయిన్ గా నటించిన బిగ్ బాస్ సినిమాలోని వాన పాట . ఇక ఇద్దరు కలిసి వర్షంలో ఉరుము వచ్చేసిందో  మెరుపొచ్చేసిందో  అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేస్తూ ఉంటే ప్రేక్షకులు మైమరచిపోయారు  అనే చెప్పాలి. ఈ పాట అప్పట్లో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది . ఇప్పటికి కూడా ఈ పాట ఎంతోమంది అలరిస్తూనే ఉంది. ఇక చిరంజీవి రోజా కాంబినేషన్ లో రైన్ సాంగ్  అంటే ప్రేక్షకులకు ఎపుడూ ఫేవరేట్ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: