టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ లు నిలబడాలి అంటే కచ్చితంగా ప్రయోగాలు చెయ్యాల్సిన అవసరం అనేది ఉంది. లేకపోతే వాళ్ళను కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. టాలీవుడ్ లో చాల అమంది హీరోయిన్ లు అవకాశాల కోసం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న హీరోయిన్ లు పెద్ద హీరోయిన్ లు అనే తేడా లేకుండా ప్రస్తుతం అవకాశాల కోసం కష్టపడే పరిస్థితి వచ్చింది టాలీవుడ్ లో అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో ఇప్పుడు  అగ్ర హీరోయిన్ లు అందరూ కూడా సోలో గానే సినిమాలు చేస్తున్నారు. 

 

అందులో అనుష్క కాజల్ ఉన్నారు ఇక కాజల్ మాత్రమే హీరోల పక్కన సినిమాలు చేస్తుంది. అనుష్క హీరో పక్కన సినిమా చేసి చాలా రోజులు అయింది. ఇది పక్కన పెడితే ఒక వార్త ఏంటీ అంటే... టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ బోల్డ్ సినిమాలో నటించడానికి గానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక యువ దర్శకుడు దర్శకత్వంలో బోల్డ్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కథ కూడా విన్నట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. 

 

మరి ఎప్పుడు ఈ సినిమాను చేస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో చేస్తుంది. చిరంజీవి ఆచార్య సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడటం తో పాప కూడా ఇప్పుడు ఖాళీ గానే ఉన్న సంగతి తెలిసిందే. మరి ఎప్పుడు  ఈ సినిమా మొదలవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాలో డబ్బింగ్ చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: