టాలీవుడ్ అంటేనే అదొక చిత్రమైన లోకం. అక్కడ ఉన్న వారు డెమ్మీ గాడ్స్. వారు నీలి ఆకాశంలో మెరిసే  తారలు. ఎపుడూ అక్కడే వెలుగుతూ  ఉంటారు. అటువంటి టాలీవుడ్ ఇపుడు రియల్ లైఫ్ లోకి వచ్చింది. ఇక టాలీవుడ్ ఇప్పుడిపుడే జగన్ వైపు చూస్తోంది. జగన్ బంపర్ మెజారిటీతో సీఎం గా గెలిచినా ఒక్కటంటే ఒకక్ అభినందన రాలేదు. ఇప్పుడు ఏడాది పాలన పూర్తి చేసుకుని జగన్ రెండవ ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ టాలీవుడ్ పెద్దలు కట్టకట్టుకుని జగన్ వద్దకు వెళ్తున్నారు.

 

అయితే వారి అవసరాల కోసమే వారు జగన్ని కలుస్తున్నారని చెప్పుకోవాలి. జగన్ ఏపీలో సినిమా షూటింగులకు ఉచితంగా అనుమతులు ఇచ్చారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇంకా సినిమా వారికి అవసరాలు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు. వాటిని తాను పరిష్కరిస్తామని కూడా అంటున్నారు.

 

దాంతో జగన్ ఇచ్చిన అభయంతో టాలీవుడ్ మొత్తం కదులుతోంది. వివిధ విభాగాలకు చెందిన వారంతా తమ ప్రతినిధులతో జగన్ని ఈ నెల 9న కలుస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి నేత్రుత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇపుడు జగన్ వైపు చూస్తోంది. గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఆయనకు టాలెవుడ్లో మెజారిటీ మద్దతుగా ఉండేవారు. 

 

ఇక కేసీయార్ తెలంగాణా సీఎం అయ్యాక ఆయన చుట్టూ కూడా టాలీవుడ్ తిరుగుతోంది. ఇదిలా ఉండగా గడదిచిన ఆరేళ్ళుగా టాలీవుడ్ హీరోలు ఏపీకి చేసిన సాయం ఏదీ లేదని ప్రముఖ సినీ నిర్మాత అంబికా క్రిష్ణ ఈ మధ్య మీడియా సమావేశంలో ఘాటుగానే విమర్శలు చేశారు. తాను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్నపుడు ఏపీకి టాలీవుడ్ ని తీసుకువచ్చేందుకు పెద్ద ప్రయత్నమే చేశానని అయితే ఎవరూ స్పందించలేదని కూడా ఆయన పాత నిజాలు చెప్పారు.

 

కనీసం సినిమా  షూటింగులు కూడా ఏపీలో చేయలేదని కూడా ఆయన అన్నారు. సరే ఇపుడు జగన్ తెలుగు సినీ పరిశ్రమను ఏపీలో అభివ్రుధ్ధి చేయాలనుకుంటున్నారు. వీలైతే విశాఖలో నిర్మాతలు, హీరోలు  స్టూడియోలు కట్టుకోవడానికి భూములు ఇస్తామని కూడా భారి ఆఫర్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు మరి తెలుగు సినిమా యాక్టివిటీ ఏపీలో పెరిగేలా టాలీవుడ్ నుంచి కూడా గట్టి ప్రయత్నం జరిగితేనే ఏపీకి మేలు జరుగుతుంది. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: