లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సినీ కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. లాక్ డౌన్ సండలింపుల్లో భాగంగా త్వరలోనే షూటింగులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ షూటింగ్ పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడో తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైందని సమాచారం. సత్యదేవ్ హీరోగా వస్తున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ‘నెట్ ఫ్లిక్స్’ లో రిలీజ్ కాబోతోందనే వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

IHG

 

లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కింది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలు. జ్యోతిలక్ష్మి, బ్రోచేవారెవరురా, బ్లఫ్ మాస్టర్.. వంటి సినిమాల్లో నటించిన సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించాడు. మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘మహేషింతే ప్రతీకారమ్’ అనే సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కింది. కేరాఫ్ కంచరపాలెంతో దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 17నే విడుదల చేయాలని భావించారు నిర్మాతలు. పరిస్థితుల నేపథ్యంలో విడుదల వాయిదా పడింది.

IHG

 

ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఇండియాకు డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజ్ కు నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. జూన్ నెలలోనే నెట్ ఫ్లిక్స్ లో సినిమా విడుదల కానుందని అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత సినిమా పరిస్థితులపై ఎవరికీ ఓ అంచనా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీనిపై ఆర్కా మీడియా నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: