జూనియర్ ఎన్టీయార్  టాలీవుడ్ యంగర్ జనరేషన్ లో అగ్రనటుడు. టాప్ రేంజి హీరోల సరసన రాణిస్తున్న యువ నటుడు. ఎన్టీయార్ చేతిలో ఇపుడు చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రెండేళ్ళుగా ఇరుక్కుపోయారు. అది పూర్తి అయి రిలీజ్ అవడానికి మరో ఏడాది అవుతుంది అంటున్నారు.

 

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు. లాక్ డౌన్ పూర్తిగా సడలించి షూటింగులకు అనుమతులు ఇచ్చేశాక  ముందుగా పెద్ద సినిమాల  షూటింగులు ప్రయారిటీ బేసిస్ మీద మొదలవుతాయని అంటున్నారు. ఇక చిరంజీవి ఆచార్య మూవీ కూడా ఓ వైపు  ఉంది. అయితే ఆచార్య మూవీకి చరణ్ కూడా ఒక నిర్మాత. పైగా ఆయన ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్నారు.

 

 

అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది.  చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగులొ ఇరుక్కున్నాడు. దాంతో రాజమౌళిని రిక్వెస్ట్ చేసి చరణ్ తన షూటింగ్ పార్ట్ ని తొందరగా పూర్తి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఆ విధంగా ఆర్.ఆర్.ఆర్ నుంచి బయటపడితే చరణ్ ఆచార్య నిర్మాణ పనులతో పాటు, తన పాత్ర కూడా అక్కడ పోషించడానికి వీలు అవుతుందన్న మాట.

 

 

దాంతో షూటింగులకు అనుమతి రాగానే ముందు చరణ్ పార్ట్ ని షూట్ చేయడానికి రాజమౌళి రెడీ అవుతారని అంటున్నారు. అదే జరిగితే ఎన్టీయార్ మరింతగా వెనకబడతారని అంటున్నారు. ఎన్టీయార్ కూడా ఇప్పటికే త్రివిక్రం తో కమిట్ అయి ఉన్నాడు. మరి చరణ్ పార్ట్ పూర్తి చేసి ఎన్టీయార్ తో షూటింగ్ అనేసరికి కచ్చితంగా కొన్ని నెలలు పడుతుంది.

 

 

దాంతో అప్పటివరకూ ఎన్టీయార్ ఖాళీగా ఉండాల్సివస్తుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ ఎపుడు పూర్తి అయితే అప్పటివరకూ వేరే కొత్త సినిమా షూటింగ్ ఉండదు, దాంతో జూనియర్ దీని మీద ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: