‘బాహుబలి’ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో సినిమా అదిరిపోయే కలెక్షన్లతో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. ‘బాహుబలి’ సినిమా తో భారతీయ చలన చిత్ర రంగం యొక్క దమ్మేంటో తెలిసొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది.

IHG

అన్ని భాషల్లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా  అదే రేంజ్ లో స్మాల్ స్క్రీన్ పై కూడా రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో టిఆర్పి రేటింగులు సాధించడం మనకందరికీ తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచిన గాని 'బాహుబలి' సినిమా కన్నడంలో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదట. అయితే మొట్టమొదటి సారిగా కన్నడ వెర్షన్ లో ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 

IHG

మొట్ట మొదటి సారిగా కన్నడలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్టు సమాచారం. అక్కడ కూడా స్టార్ సంబంధిత ఛానెల్ స్టార్ సువర్ణ లో అతి త్వరలో టెలికాస్ట్ కానున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ‘బాహుబలి’ కోసం ఎగ్జిట్ అవుతున్నారు కన్నడ జనాలు. చాలా తెలుగు సినిమాలను కన్నడ ప్రేక్షకులు ఆదరించటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర రంగం యొక్క స్థాయిని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచిన 'బాహుబలి' ని ఏ విధంగా కన్నడ ప్రజలు ఆదరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: