టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మసినిమా చేసినా సరే ఒక సంచలనమే. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ ఉంటుంది గాని సినిమా మాత్రం కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే విషయ౦ స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన క్లైమాక్స్ అనే సినిమాతో పాటుగా కరోనా అనే సినిమాను కూడా చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ మొత్తం పూర్తి అయి విడుదలకు కూడా సిద్దంగా ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను ఒక స్టార్ హీరోతో సీరియస్ ప్రాజెక్ట్ ని చేసే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. 

 

అగ్ర హీరోతో ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి వర్మ చర్చలు జరుపుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ ప్రాజెక్ట్ ఏంటీ అనేది తెలియదు గాని దీనికి సంబంధించి మాత్రం కథ కూడా ఒకటి వర్మ వద్ద సిద్దంగా ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన వర్మ దానికి సంబంధించి చర్చలు కూడా జరిపారు అని సమాచారం. కథ అంతా సిద్దంగా ఉంది అని సినిమాను మొదలు పెట్టడమే ఆలస్యం అని చెప్పినట్టు సమాచారం. సినిమాను లాక్ డౌన్ తర్వాత మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

 

అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం స్పష్టంగా ఎవరికి కూడా తెలియదు. దీనికి సంబంధించి చర్చలు కాస్త ఒక దశకు వచ్చాయి అని సమాచారం. ప్రస్తుతం వర్మ  సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను ఆయన చేయడానికి ఇప్పుడు సిద్దమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లవ్ అండ్ యాక్షన్ గా తీసుకొచ్చే ఆలోచనలో వర్మ ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: