ఒకప్పుడు అనుష్క సినిమా వస్తుంది అంటే చాలు హీరో సినిమా వస్తుంది అనే స్థాయిలో ఉండేది క్రేజ్. ఆమె సినిమాలు అనగానే జనాలకు ఒక ఆసక్తి. ఈ తరంలో హీరోల పక్కనే కాకుండా సోలో గా సినిమాలు చేసి సూపర్ హిట్ అయిన హీరోయిన్ ఆమె ఒకరే అనే విషయం అందరికి తెలిసిందే. ఏ హీరో పక్కన సినిమా చేసినా సరే ఆమెకు ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఆమె ఇప్పుడు సోలో గానే సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా ఆమెకు ఆఫర్లు రావడం లేదు. దీనితో ఇప్పుడు ఆమె సినిమాల మీద ఇష్టం చంపుకోలేక కాస్త దూరంగా ఉంటూనే ఏదోక రకంగా సినిమాల్లో కనపడే ప్రయత్నం అయితే చేస్తుంది. 

 

ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహించే ఆలోచనలో ఉంది అని సమాచారం. రాఘవేంద్ర రావు పర్యవేక్షణ లో ఆమె ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయి అని దీనికి పెట్టుబడి ఎవరు పెడతారు అనేది తెలియదు గాని ఒక మంచికథ మాత్రం దీనికి సంబంధించి సిద్దంగా ఉంది అని అయితే తెలుస్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్ గ చేసిన ఆమె ఇప్పుడు ఇలా డైరెక్టర్ గా మారాలి అనుకునే ఆలోచన వెనుక కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె మాత్రం త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉంది అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమె ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు ఇంట్లో వాళ్ళతో కూడా చేస్తుంది అని సమాచారం. కాగా ఆమె నటించిన ఒక సినిమా విడుదలకు సిద్దమై ఆగిపోయింది. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది తెలియదు. ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేయడానికి నో అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: