ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్న హీరో ఎన్టీఆర్. బాబు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు అనే వార్తలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అతను ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ లతో పాటుగా చిన్న చిన్నవి కూడా చేస్తూ బిజీ గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు అన్నతో కలిసి ఒక చిన్న సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. అన్న తో కలిసి ఎప్పటి నుంచో ఒక సినిమాను నిర్మించాలి అనే ఆలోచనలో ఉన్న అతను... ఇప్పుడు దానికి శ్రీకారం చుట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు శర్వా తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అని సమాచారం. నిజం ఎంత అనేది తెలియదు గాని దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన రానుంది. భార్గవ్ హరీ బ్యానర్ తో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కూడా సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది స్పష్టత లేదు గాని దీనిని మాత్రం చాలా వేగంగా తీసుకొచ్చే ఆలోచనలో అతను ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

సినిమా విషయంలో అతను చాలా ఆసక్తిగా ఉన్నాడు అని అలాగే కొడుకులతో కలిసి ఒక చిన్న వెబ్ సీరీస్ ని కూడా అతను ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. నిజమా కాదా అనేది తెలియదు గాని దీని మీద త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సరే తారక్ మాత్రం ఇప్పుడు నిర్మాతగా బిజీ అవ్వాలి అనుకోవడం అభిమానులకు పండగే అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: