అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసారు. హిందీలోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇక అప్పటి నుండి తెలుగు సినిమాల మీద బాలీవుడ్ నిర్మాతలకి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అటు టెంపర్ కి రీమేక్ గా వచ్చిన మాస్ మసాలా చిత్రం సింబా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో బాలీవుడ్ నిర్మాతలు తెలుగు సినిమాల మీద పడ్డారు.

 

ఇప్పటికే చాలా చిత్రాలు హిందీలో రీమేక్ కి వెళ్లాయి. జెర్సీ, ఆర్ ఎక్స్ 100, భాగమతి, వంటివి సెట్స్ మీద ఉండగా, చర్చల దశల ఉన్న సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్, అల వైకుంఠపురములో మొదలగునవి ఉన్నాయి. తాజాగా మరో సూపర్ హిట్ తెలుగు చిత్రం హిందీలో రీమేక్ కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ చిత్రం హిందీలో రీమేక్ కానుందట. రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BHEESHMA' target='_blank' title='bheeshma-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bheeshma</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> Leaked ...


సేంద్రీయ వ్యవసాయం గురించిన కథని కమర్షియల్ గా తీర్చిదిద్దిన విధానం చాలా బాగుండడంతో బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమా రైట్స్ ని కొనుక్కున్నారు. అయితే స్టార్ ఇమేజ్ కి సరిపడా స్టఫ్ ఉన్న ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. తాజాగా రణ్ బీర్ కపూర్ పేరు బయటకి వినిపిస్తుంది. రణ్ బీర్ కపూర్ అయితే ఈ సినిమా కథకి సరిగ్గా సెట్ అవుతాడని అనుకుంటున్నారు.

 


అయితే రణ్ బీర్ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరదేమో అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే హీరో రణ్ బీర్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నాడట. నిజానికి స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తే సినిమా ఫలితం మరోలా ఉండేది. బ్లాక్ బస్టర్ కావల్సిన ఈ చిత్రం అన్ సీజన్లో రిలీజ్ చేయడం ఒకటి, స్టార్ హీరో లేకపోవడం వంటి కారణాల వల్ల హిట్ గా నిలిచిందని అన్నారు. మరి బాలీవుడ్ లో స్టార్ హీరోతోనైనా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: