కరోనా మూలంగా థియేటర్లన్నీ మూతబడ్డాయి. దాంతో వినోదం కోసం ప్రేక్షకులందరూ ఓటీటీని ఆశ్రయించారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ అని తేడా లేకుండా అన్ని భాషల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల మనుగడ కష్టమే అన్న వాదనలు కూడా వినిపించాయి. భవిష్యత్తు మొత్తం డిజిటల్ లోనే సాగుతుందన్న వాదన కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

 


వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో క్లైమాక్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కించాడో ఏమో తెలియదు గానీ లాక్డౌన్ లో జనాలందరూ ఓటీటీకి బాగా అలవాటు పడ్డాక బయటకి తీసుకువచ్చాడు. ఒక ఎడారిలో భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కి వస్తే ఎదురయ్యే భయానక సంఘటనలని ఈ సినిమా ద్వారా చూపించాడట.

IHG

అయితే ప్రస్తుతం థియేటర్లు మూతబడడంతో ఈ సినిమాని శ్రేయాస్ ఆప్ లో రిలీజ్ చేసారు. ఆర్జీవీ వరల్డ్ లేదా శ్రేయాస్ యాప్ ద్వారా వంద రూపాయలు కట్టి ఈ సినిమా చూసే వీలుని కల్పించాడు. నిన్న రాత్రి విడుదలైన ఈ సినిమాకి రెస్పాన్స్ బాగానే వచ్చింది. రిలీజైన కొద్ది గంటల్లోనే వెబ్ సైట్ క్రాష్ అయ్యిందంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు.

 

IHG's CLIMAX Trailer 2 | Mia Malkova | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAM GOPAL VARMA' target='_blank' title='ram gopal varma-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram gopal varma</a> | Shreyas ...

అయితే రిలీజైన కొద్దిసేపటికే క్లైమాక్స్ మూవీ పైరసీ రూపంలో ఆన్ లైన్లోకి రావడం ఆర్జీవీని షాక్ కి గురి చేసింది. వంద రూపాయలు కట్టి చూడాల్సిన ఈ సినిమా ఆన్ లైన్లో ఫ్రీగా దొరుకుతుండడంతో అందరూ అటువైపు వెళ్తున్నారు. తమిళ రాకర్స్ వెబ్ సైట్లో ఈ క్లైమాక్స్ మూవీ హెచ్ డీ ప్రింట్ రూపంలో ఫ్రీగా లభ్యం అవుతుంది. ఈ ఒక్క సినిమానే కాదు, ఓటీటీలో రిలీజ్ అయిన చాలా సినిమాలు ఇలా పైరసీ అవుతున్నాయి. దీనివల్ల ఓటీటీ నిర్వాహకులే కాదు, సినిమా నిర్మాతలు చాలా నష్టపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: