తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చేప్పేదేం లేదు. ఆయన నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే చిరంజీవి పేరు నిలబెట్టాడు. చిరంజీవి కొడుకు నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనేంతగా ఎదిగిపోయాడు. డ్యాన్స్ తోపాటు నటన, తనదైన స్టైల్ తో స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం మెగా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కలిసి ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. #boxofficekingRAMCHARAN హ్యాష్ ట్యాగ్ తో చరణ్ పేరుతో ఉన్న రికార్డులను ట్రెండ్ చేస్తున్నారు.

IHG

 

‘చిరుతతో ఓ డెబ్యూ హీరో సాధించిన రికార్డులు ఇంకా చిరుత పేరుతోనే ఉన్నాయి. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ సాధించిన ఘనత చరణ్ సొంతం. వినయ విధేయ రామ వంటి ఫ్లాప్ మూవీతో 60కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. జపాన్ లో బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లు ఉన్న తెలుగు సినిమా మగధీర. సమకాలీన హీరోల్లో రెండు ఇండస్ట్రీ హిట్లు ఉన్న ఏకైక హీరో రామ్ చరణ్. నోట్స్ బ్యాన్ టైమ్ లో వచ్చిన ధ్రువ కూడా 55కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాడు. మరే హీరోకు లేని విధంగా అన్ని ఏరియాల్లో పట్టున్న హీరో. రాయలసీమలో వినయ విధేయ రామకు హిట్ సినిమా స్థాయి కలెక్షన్లు రావడమే నిదర్శనం’ అంటూ మెగా ఫ్యాన్స్ రఫ్పాడించేస్తున్నారు.

IHG

 

ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ఈమధ్య హీరోల ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ హీరో రికార్డులు, కలెక్షన్లు, చారిటీస్.. ఇలా తమ హీరో గొప్పదనాన్ని చెప్తున్నారు. ట్విట్టర్ లో వచ్చే ట్వీట్స్ ద్వారా తమ బలాన్ని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటే చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్యలో కూడా నటిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: