సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లో మియా మాల్కోవా, రెనాన్ సేవరో లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా క్లైమాక్స్. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్  చేసిన ఈ సినిమా ట్రైలర్ తో  అంచనాలు పెంచిన వర్మ సినిమా ఎలా తీశాడు..? ఇంతకీ వర్మ క్లైమాక్స్ కథ ఏంటి..? క్లైమాక్స్ తో ఆర్జీవీ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడా..? అన్నది ఈ సమీక్షలో చూద్దాం. 

 

కథ :

 

ఓ జంట ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఏడారి ప్రాంతానికి వెళ్తారు. ఎడారిలో ఏకాంతంగా రొమాన్స్ తో ఎంజాయ్ చేసుకుంటున్న వీరి జీవితంలోకి కొందరు వ్యక్తులు.. కొన్ని అనుకోని సంఘటలను ఎదురవుతాయి. వాటిని ఈ ఇద్దరు ఎలా ఎదుర్కొన్నారు. ఇంతకీ వాళ్లకు ఎదురైనా సమస్యలు ఏంటి..? వాటి నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది సినిమా కథ. 

 

విశ్లేషణ :

 

అందరు లాక్ డౌన్ టైం లో బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ తో ఇంటి పనులు చేస్తుంటే తను సినిమా తీశా అంటూ ఇండస్ట్రీ అంతటిని ఒక్క డైలాగ్ తో షాక్ ఇచ్చిన ఆర్జీవీ తను తీసిన క్లైమాక్స్ సినిమాతో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నో ఎంట్రీ అని ఉన్న ఎడారి ప్రాంతంలో ఓ యువ జంట వెళ్లడం.. అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నది చూప్పించారు. అయితే వర్మ చెప్పినట్టుగా క్లైమాక్స్ లో పెద్దగా ట్విస్టులు, థ్రిల్లర్ కథాంశాలు ఏమి లేవు. 

 

థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన స్టఫ్ కూడా లేదని చెప్పొచ్చు. కేవలం మియా మాల్కోవా అందాల మీద ఫోకస్ పెట్టిన ఆర్జీవీ సినిమా కథ, కథనాలను అసలు పట్టించుకోలేదు. ఇది సినిమా చూసిన ప్రేక్షకులకు అర్ధమవుతుంది. సినిమాలేవీ రిలీజ్ కానీ టైం లో ఆర్జీవీ క్లైమాక్స్ అది కూడా ఏటిటి రిలీజ్ అనగానే ఎక్సయిటింగ్ తో 100 రూపాయలు పెట్టి సినిమా చూసిన ఆడియెన్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు వర్మ. అసలు ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో ఇదేం సినిమారా బాబు అనిపించేలా తలలు పట్టుకున్నాడు ఆర్జీవీ. 

 

మియా మాల్కోవాఅందాలను మాత్రమే హైలెట్ చేస్తూ క్లైమాక్స్ సినిమా తీశాడు వర్మ. సహా నటుడిగా చేసిన రెనాన్ సేవరో కూడా జస్ట్ ముద్దులకు మాత్రమే పరిమితం అయ్యాడు. క్లైమాక్స్ సినిమా చూశాకా దీనికన్నా ట్రైలర్ కాస్త బెటర్ అనిపిస్తుంది. మొత్తానికి వర్మ క్లైమాక్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 

 

నటీనటుల ప్రతిభ :

 

మియా మాల్కోవా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేసింది. ఎక్కడ సిగ్గు బిడియం లాంటివి లేకుండా పూర్తిగా తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కొన్ని చోట్ల న్యూడ్ సీన్స్ లో కూడా నటించింది అమ్మడు. ఇక రెనాన్ సేవరో కూడా జస్ట్ ఓకే అనిపించాడు ఇక సినిమాలో మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు. 

 

సాంకేతికవర్గం పనితీరు :

 

అగస్త్య మంజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో బాగా పనితనం చూపించిన టెక్నీషియన్ ఎవరైనా  ఉన్నారు అంటే అది కెమెరా మెన్ అని చెప్పొచ్చు. ఇక  రవి శంకర్ మ్యూజిక్ ఓకే అనేలా ఉంది. కథ, కథనాల్లో ఆర్జీవీ ఏమాత్రం తన ప్రతిభ చూపపేరు. కేవలం మియా అందాల మీద ఫోకస్ పెట్టి అసలు సినిమా ఏం తీస్తూన్నాడో కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనేలా ఉన్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ :

 

మియా మాల్కోవా 

 

సినిమాటోగ్రఫీ 

 

మైనస్ పాయింట్స్ :

 

మిగిలినవి అన్ని 

 

బాటమ్ లైన్ : వర్మ కెరియర్ కు క్లైమాక్స్

 

రేటింగ్ : 0.5/5 

మరింత సమాచారం తెలుసుకోండి: