ప్రణీత అనే పేరు వింటే ఆమె చేసిన సినిమాల కంటే చారిటీనే గుర్తొస్తుందేమో ఎవరికైనా. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన సాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఆహారం ప్యాకెట్లు కట్టి అందించటం, ఆటోలకు ప్లాస్టీక్ షీట్లు వేసి శానిటైజర్లు ఇచ్చింది. ఆమెలోని ఈ మానవతా దృక్పథం ఎందరినో ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్ కాలేకపోయినా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. పవన్ తో చేసిన అత్తారింటికి దారేది ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రణీత బాలీవుడ్ సినిమాల్లో తన లక్ ట్రై చేసుకుంటోంది.

IHG'Hungama 2' - Weekly Voice

 

బాలీవుడ్ లో ప్రణీత నటించిన సినిమా ‘భుజ్.. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవ్ గన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రణీత నటించింది. సొనాక్షి సిన్హా, నోరా ఫతేహితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ న్యూస్ బాలీవుడ్ లో వైరల్ అవుతోంది. ‘భుజ్’ ను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ ఓ వార్త రౌండ్ అవుతోంది. ప్రస్తుతం ఈవార్తపై అఫిషియల్ న్యూస్ లేకపోయినా ఈ వార్త నిజమైతే ప్రణీతకు శుభవార్తే. ఆమె తొలిసారిగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఈ సినిమాతో పాటు ప్రణీత హంగామా2లో కూడా నటించింది.

IHG's 'Hungama 2' to clash with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AJAY' target='_blank' title='ajay - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ajay </a>Devgn's 'Bhuj: The ...

 

బాలీవుడ్ లో 2003లో వచ్చిన హంగామాకు ఇది సీక్వెల్. ప్రణీత రెండు హిందీ సినిమాలు చేసినా లాక్ డౌన్ వల్ల ఒక్కటీ విడుదల కాలేదు. లాక్ డౌన్ తో ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రణీత తన చారిటీతో దేశవ్యాప్తంగా పాపులరైంది. దీంతో ఈ నేపథ్యంలో భుజ్ ఓటీటీలో రిలీజ్ అయితే ప్రణీత కెరీర్ కు ప్లస్ అవుతుందనే చెప్పాలి. దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: