అది నిజంగా కన్నులపండుగే. అది నిజంగా అపురూప సన్నివేశమే. ఆ ఇద్దరూ కలిస్తే చూడాలని అభిమానజనం ఎపుడూ అర్రులుచాస్తూంటుంది. తెలుగు సినిమాకు అతి పెద్ద మూల స్తంభంగా అనదగ్గ నందమూరి కుటుంబం నుంచి బాలక్రిష్ణ టాప్ రేంజి హీరోగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నారు.

 

ఆయన తరువాత మూడవతరంలో జూనియర్ ఎన్టీయార్ ఉన్నాడు. ఈ ఇద్దరు సీనియర్ ఎన్టీయార్ ఖ్యాతిని నిలబెడుతున్నారు. ఎన్టీయార్ 1982లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన నటవారసత్వాన్ని బాలయ్య తీసుకుని నాలుగున్నర దశాబ్దాబ్లుగా తెలుగు తెర మీద  సత్తా చాటుతున్నారు.

 

బాలయ్య పక్కా మాస్ హీరో. ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి వెండితెర వెలుగుగా నిలిచారు. ఇక ఆయన తరువాత అంతే మాస్ అప్పీల్ తో దూసుకొచ్చిన యువ కెరటం జూనియర్ ఎన్టీయార్.  బాబాయ్ బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీయార్ కలసి నటించాలని అభిమానుల కోరిక.

 

దానికంటే ముందు ఈ ఇద్దరూ కనీసం వేదికలు పంచుకోవాలని కూడా ఆశ పడుతున్నారు. ఇపుడు అది నెరవేరబోతోంది. బాలయ్య షష్టి పూర్తి వేళ జూనియర్ ఎన్టీయార్ బాలక్రిష్ణ ఇంటికి వెళ్తున్నారు. అలాగే మరో హీరో నందమూరి కళ్యాణ్ రాం కూడా హాజరవుతున్నారు. ఇక బాలయ్య అక్క దగ్గుబాటి పురంధేశ్వరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు బాలయ్య ఇంట కనుల విందు చేయనున్నారట.

 

ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఆ రోజున బాలక్రిష్ణ  ఇంటికి ప్రత్యేకంగా  వచ్చి బావమరిదికి పుట్టిన రోజు శుభాకాక్షలు చెబుతారని అంటున్నారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ తో పాటు బాలయ్య అల్లుళ్ళు కూడా వస్తారని అంటున్నారు. వీరంతా ఎలా ఉన్న జూనియర్ ఎన్టీయార్ బాలయ్య కలయిక మాత్రం సెన్సేషనల్ న్యూస్ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఆ శుభ ఘడియల కోసం

మరింత సమాచారం తెలుసుకోండి: