సినిమాల్లో ట్రెండ్ తో సంబంధం లేని సబ్జెక్ట్ లవ్. ప్రేమకథలు ఎంత కొత్తదనంతో వచ్చినా.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆదరిస్తారు ఆడియన్స్. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి.. హిట్ అయ్యాయి. అదే జోనర్ లో తీసినా.. ఫ్రెష్ టేకింగ్, స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ‘హ్యాపీడేస్’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ధియేటర్లన్నీ కాలేజీ క్యాంపస్, గార్డెన్స్, పార్క్స్, క్యాంటీన్స్ అయిపోయాయి.

IHG

 

ఈ సినిమాలో నలుగురు కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిల ఫ్రెండ్షిప్, ప్రేమ, క్యాంపస్ అల్లరి ఉంటుంది. మొత్తం సినిమా కాలేజీలోనే తెరకెక్కడంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. హైదరాబాద్ సీబీఐటీలో తెరకెక్కించి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాడు శేఖర్. సినిమా కలర్ ఫుల్ గా రావడానికి ఇదొక కారణం. కాలేజీ డేస్ అయిపోయిన వాళ్లకి బాధ, కాలేజీకి వెళ్లబోయే వారికి ఆశ, మధ్యలో చదువు ఆపేసిన వాళ్లకు మళ్లీ చదువుపై కోరిక కలిగేలా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా క్రియేట్ చేసిన మరో ఇంపాక్ట్ ‘బీటెక్ చదివేయాలి.. అంతే’ అని ప్రతి స్టూడెంట్ కి అనిపించేంత.

IHG

 

అల్లరి, గ్యాంగ్, ఫ్రెండ్స్, టూర్, ఫ్రెషర్స్ పార్టీ, క్యాంపస్ జాబ్.. ఇలా సినిమాలో ప్రతీది కొత్తదనమే. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంగీతం. మిక్కీ జె మేయర్ కు తొలి సినిమా. పాటలతో, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ తో సినిమాలో లీనమయ్యేలా చేసి పెద్ద మ్యాజిక్కే చేశాడు. సినిమాటోగ్రఫీ సినిమాకో అందం. ఇదే థీమ్ తో మరెన్నో సినిమాలు రావడానికి కారణమైంది ‘హ్యాపీడేస్’. ప్రతిఒక్కరికీ తమకుతాము ఈ సినిమాలో ఐడెంటిఫై అయిపోయేలా ఉండటమే ‘హ్యాపీడేస్’ విజయ రహస్యం.

IHG'S FILM “HAPPY DAYS” CAST ...

.

మరింత సమాచారం తెలుసుకోండి: