80లలో తెలుగు తెర మీద హారర్‌ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఆ తరువాత కమర్షియల్ ఫార్మట్ సినిమాకు ప్రేక్షకులు అలవాటు పడిపోవటంతో ఆ తరహా సినిమాలు పూర్తిగా ఆగిపోయాయి. హీరో సెంట్రిక్ సినిమాల హవాలో మిగతా జానర్‌ లు అన్ని మరుగున పడిపోయాయి. అందుతో హరర్ సినిమా కూడా ఒకటి. అయితే అడపాదడపా ఒకరిద్దరు దర్శకుడు హరర్ సినిమాలు చేసే ప్రయత్నం చేసినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు.

 

అయితే ఆ ఫార్ములాను బ్రేక్ చేసిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. కేవలం కెమెరా టెక్నిక్‌, భయానక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ను మాత్రమే అలరించే హరర్ సినిమాకు కామెడీ టచ్‌ ఇచ్చి అందరికీ చేరువ చేసిన సినిమా ప్రేమ కథా చిత్రం. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి స్వయంగా కథ అందించి  నిర్మించిన ఈ సినిమాకు ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాతో టాలీవుడ్‌ లో హరర్‌ కామెడీల హవా మొదలైంది.

 

అప్పటి వరకు సాలిడ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌ బాబుకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా ప్రేమకథా చిత్రమ్. నందితా హీరోయిన్‌గా దెయ్యం పట్టిన అమ్మాయిగా అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఇరగదీసింది. ఇక ప్రవీణ్, సప్తగిరి కామెడీ సినిమాతకు ప్రధాన ప్లస్ పాయింట్‌. ఈ ఇద్దరు తమ కామెడీ టైమింగ్‌తో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇలా అన్ని కలిసి ప్రేమకథా చిత్రమ్ బ్లాక్‌ బస్టర్ హిట్ కావటంతో ఆ తరువాత ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి.

 

ముఖ్యంగా ఈ సినిమా ఇన్సిపిరేషన్‌తోనే గీతాంజలి, రాజుగారి గది సీరిస్‌ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల పాటు తెలుగు వెండితెరను ఏలిన హరర్‌ కామెడీలు తరువాత రొటీన్‌ కావటంతో మళ్లీ కనుమరుగవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: