అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అందుకుందో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కి గల కారణాల్లో ప్రధానంగా మ్యూజిక్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. థమన్ స్వరపరిచిన పాటలు అందర్నీ అలరించాయి.

 

 

సామజ వరగమనా మొదలుకుని, రాములో రాములా, బుట్టబొమ్మ ఒక్కటేమిటి ఇందులో ఉన్న ప్రతీ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల వైకుంఠపురములో ఆల్బమ్ కి వన్ బిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ పాటలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని అలరించాయో అర్థం చేసుకోవచ్చు. బుట్టబొమ్మ పాటయితే ఖండాంతరాలు దాటి మరీ ఖ్యాతి తెచ్చుకుంది.

 

 

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పాటకి స్టెప్పులేసిన్ తన ఇష్టాన్ని చూపించాడు. అటు యూట్యూబ్ లోనూ, టిక్ టాక్ లలోనూ ఈ పాట అందరినీ ఆకర్షించింది. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ పాటకి స్టెప్పులు వేసారు. అందులో శిల్పాశెట్టి కూడా ఒకరు. బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పాశెట్టి మరో మారు అల వైకుంఠపురములో పాటకి రెస్పాండ్ అయ్యింది. అయితే ఈ సారి డాన్స్ ద్వారా కాకుండా పాట పాడుతూ పెదవులు కదిపింది.

 

 

'సామజవరగమనా' పాటకి  టిక్ టాక్ చేసి, అందర్నీ అలరించింది. ఈ వీడియోలో తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ పంజాబీ గుజరాతీ హిందీ లాంటి ఏడు భాషల్లో ఉన్న ఈ పాటలకు గొంతు సవరించుకుంది. పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన ఈ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకాలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

 

 

https://www.tiktok.com/@theshilpashetty/video/6832893017813273857?referer_url=https%3A%2F%2Fwww.123telugu.com%2Fmnews%2Fbollywood-actress-impressive-medley-of-samajavaragamana-and-south-hits.html&referer_video_id=6832893017813273857

మరింత సమాచారం తెలుసుకోండి: