మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం భరత్ అను నేను. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఉండాలి లేదా పాలన ఈ విధంగా ఉండాలి అని నిరూపించిన సినిమా ఇది. సాధారణంగా అప్పటి వరకు ముఖ్యమంత్రుల కాన్సెప్ట్ మీద సినిమాలు వచ్చాయి గాని ఈ సినిమాలో సినిమా రావడం అనేది అదే మొదటి సారి. ఈ సినిమాలో మహేష్ నటన తో పాటుగా సినిమా కథ కూడా ఒక సంచలన౦ అనే చెప్పాలి. అప్పటి వరకు ఇలాంటి  కథలు కూడా ఉంటాయా అనే ఆలోచన ఏ హీరో దర్శకుడు చేయలేదు అనే చెప్పాలి. 

 

ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ఒక సంచలనం అనేది వాస్తవం. దాదాపు అన్ని సన్నివేశాలను కూడా చాలా అందంగా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసాడు దర్శకుడు అనేది వాస్తవం. ఈ సినిమాలో మహేష్ నటన ఒక హైలెట్ అయితే సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. సాధారణంగా ఇలాంటి సినిమాలు చేస్తే రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. అయినా సరే ఈ సినిమా విషయంలో దర్శకుడు గాని హీరో గాని ఎక్కడా కూడా వెనకడుగు వేసిన సందర్భం లేదు అనే చెప్పాలి. ప్రతీ సీన్ కూడా చాలా బాగా తీసారు. 

 

ఇక ఈ సినిమా వసూళ్లు కూడా చాలా బాగా వచ్చాయి అని చెప్పవచ్చు. అప్పటి వరకు మహేష్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు అక్కడి నుంచి మహేష్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు అనే విధంగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చాలా వరకు కమర్షియల్ మీద ఫోకస్ చేయడమే కాదు దాదాపుగా కథలు అన్నీ కూడా అలాంటివే ఎంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: