నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో పాటు విమర్శకులని సైతం మెప్పించింది. ఈ సినిమాలో వేణు ఊడుగుల తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ ని చాలా చక్కగా చూపించాడు. అయితే ఈ సినిమా అనంతరం వేణుకి రానా దగ్గుబాటి దొరికాడు.

IHG

సెన్సిబుల్ చిత్రాన్ని అందంగా తెరకెక్కించిన వేణూ, రానాతో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడని అందరూ ఆలోచిస్తున్న టైమ్ లో విరాటపర్వం అంటూ 1990 ప్రాంతంలో తెలంగాణలోని సామాజిక పరిస్థితులని చూపించడానికి రెడీ అయ్యాడు. నక్సలైట్ల కాలంనాటి కథాంశాన్ని తీసుకుని మన ముందుకు వస్తున్నాడు. రివల్యూషన్ ఈజ్ ఎన్ ఆక్ట్ ఆఫ లవ్ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ మూడు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.

IHG's intense look ...

 

ఈ మూడు పోస్టర్లు కూడా సినిమా థీమ్ ని బాగా క్యారీ చేసాయి. టైటిల్ పోస్టర్ మొదలుకుని, సాయి పల్లవి, ప్రియమణి ల లుక్ రిలీజ్ చేసిన పోస్టర్లన్నీ కథ తాలూకు గుబాళింపును గుబాళిస్తున్నాయి. ముఖంగా సాయిపల్లవి, ప్రియమణిల లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనవసరమైన వాటిని పోస్టర్ లో చేర్చకుండా సినిమాకి ఏం కావాలో వాటినే చేర్చుతూ, పోస్టర్ లోనే సినిమా చూపించాడు.

IHG

ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమా పోస్టర్లలో సినిమా థీమ్ ని కనబడేలా చేసిన పోస్టర్స్ ఒక్క విరాటపర్వానివే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పోస్టర్ కూడా కథ చెబుతుందంటే నిజం అని నమ్మనివాళ్ళు ఒక్కసారి ఈ పోస్టర్లని చూస్తే మీకే అర్థం అవుతుంది. నీది నాది ఒకే కథ సినిమా ద్వారా తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ ని చాలా సున్నితంగా ఆవిష్కరించిన వేణు, విరాటపర్వం ద్వారా మరో అద్భుతమైన వెండితెర అనుభవాన్ని పంచుతాడని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: