ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి తరం యువ హీరోల అందరి లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా యూత్ అందరిలో ప్రభాస్ అంటే అదో ప్రత్యేకమైన అభిమానం. అయితే ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ ప్రభాస్ నేషనల్ హీరో గా మార్చిన సినిమా బాహుబలి ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా ప్రభాస్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం స్టార్ హీరోల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే అలనాటి రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్ మొదటి సినిమాతోనే మంచి విజయం తన ఖాతాలో వేసుకుని కెరీర్ కు మంచి బాటలు వేసుకున్నాడు. 

 


 ఇక ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది కాస్త అంతగా విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమా మాత్రం ప్రభాస్ కెరియర్ ని కీలక మలుపు తిప్పడంతో పాటు టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించింది  తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసింది  అని చెప్పాలి. ఎంతో మంది యూత్ అందరూ  ప్రభాస్ ను  అభిమానించేలా చేసింది ఈ  సినిమా. ఆ సినిమాలో ప్రభాస్ యాక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం సినిమా చూస్తున్న ప్రేక్షకులకు రోమాలు నిక్క పొడిచేలా చేస్తూ ఉంటుంది.ఆ సినిమా ఏదో కాదు చత్రపతి... దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో  చెప్పాల్సిన పని లేదు. 

 


 ప్రభాస్ ని స్టార్ హీరోని చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శ్రియ నటించింది. అయితే ఒక వలస కార్మికుడి  పాత్రలో నటించిన ప్రభాస్... కార్మికుల జీవితాలను బాగు చేసేందుకు ఒక అడుగు ముందుకు వేసి చేసే యాక్షన్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటుంది. ఓ వైపు ఎమోషన్ మరోవైపు యాక్షన్ ఇంకోవైపు బలమైన కథ ఇలా అన్నీ దట్టించి దర్శకుడు రాజమౌళి చత్రపతి సినిమాని తెరకెక్కించారు. ఇక అప్పట్లో ఈ సినిమాలో ప్రభాస్ లుక్  కూడా ఎంతో మంది యువతను ఆకర్షించడం.. ఎంతో మంది ప్రభాస్ లుక్ ని కూడా ట్రై చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో  ప్రభాస్ ఎంతగానో క్రేజ్ సంపాదించాడు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే ఈ సినిమా ఫేవరేట్  గానే  నిలుస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: