ముందు అజీర్తి తో మొదలై తరువాత మన కడుపులో గ్యాస్ రూపంలో నిల్వ ఉండే మన ఆహార పదార్థాలు తరువాత శరీరంలోని ప్రతి ఒక్క భాగంపై ప్రభావం చూపిస్తాయి. దాని వల్లనే కిడ్నీలో రాళ్లు, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, శ్వాస సంబంధిత వ్యాధులు మరియు మూత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మనం రోజువారీ తీసుకునే ఆహారం మరియు బయట తినే చిరు తిండి వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అంతేకాకుండా సమస్య ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లు మరియు వాతావరణ పరిస్థితుల వల్ల యుక్తవయసులోనే చాలామందికి వస్తుంది.

 

ముఖ్యంగా నూనెలో వేయించిన అనగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడం వలన గ్యాస్ ప్రాబ్లం అధికమయ్యే ప్రమాదం ఉంది. అలా వండిన ఆహార పదార్థాలు జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే డైరీ ప్రొడక్ట్స్ అనగా పాలు మరియు వాటి పదార్థాల వల్ల గ్యాస్టిక్ ట్రబుల్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇకపోతే తర్వాతి వరుసలో చాక్లెట్, కూల్ డ్రింకులు మరియు కాఫీ ఉన్నాయి. మూడింటి వలన గ్యాస్ ప్రాబ్లం చాలా అధికం అవుతుంది. తర్వాత వచ్చే ఆహార పదార్థాన్ని మనదేశంలో చాలామంది తినకపోయినా.... గొడ్డు మాంసం అనగా బీఫ్ తినడం వలన అది అరగక మన కడుపులోనే ఎక్కువసేపు నిల్వ ఉండి గ్యాస్ ఏర్పడేందుకు అవకాశం వస్తుంది.

 

ఇకపోతే అత్యధికంగా మద్యం సేవించడం వల్ల కూడా మనం తిన్న ఆహారం జీర్ణం అవకుండా గ్యాస్ ఏర్పడేందుకు తోడ్పడుతుండగా ఇక బాగా కారంగా ఉండే వస్తువులను తింటే గ్యాస్ మన గుండె వరకు వచ్చే ప్రమాదం ఉంది. ఇక వీటన్నిటితోపాటు జామ్, జెల్లీలు, టమాటాలు పెప్పర్ మింట్ టీ, గుడ్లు, పీ నట్ బటర్ మరియు చక్కెర తరువాతి వరుసలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: