ఇప్పుడు తెలుగుకి దూరంగా ఉన్న హీరోయిన్ త్రిష. ఆమె దాదాపుగా మన తెలుగులో సినిమాలు చేయడం లేదు. అవకాశాలు వచ్చినా సరే సినిమాలు మాత్రం ఆమె చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం తెలుగులో సినిమాలకు చాలా వరకు దూరంగా ఉంది. అగ్ర హీరోలతో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం సినిమాలను చేసే అవకాశం లేదు అని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో ఆమెకు ఒక భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. 

 

అగ్ర హీరోతో ఆమెకు అవకాశం వచ్చింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరీష్ శంకర్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాలో  నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని లాక్ డౌన్ కారణంగా చిత్ర యూనిట్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడం లేదా వచ్చే ఏడాది విడుదల చేయడం అనే దాని మీద చర్చ జరుగుతుంది. 

 

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేసారు అనే స్పష్టత కూడా రావడం లేదు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ హీరోయిన్ ని ఎంపిక చేసారు అని సమాచారం. ఈ సినిమా తర్వాతే హరీష్ శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడో...

మరింత సమాచారం తెలుసుకోండి: