కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తన వారసుడు ధృవ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. విక్రమ్ 60వ సినిమాలో ధృవ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అఫీషియల్ న్యూస్ మాత్రమే కాదు సినిమాకు సంబందించిన పోస్టర్ కూడా వచ్చింది. చియాన్ 60 అంటూ తుపాకీ కాల్చిన చేతులతో ఒకవైపు మరో వైపు మరొకరు పట్టుకున్న పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. 

 

తనయుడితో కలిసి స్టార్ హీరో చేస్తున్న ఈ క్రేజీ మూవీకి ఫస్ట్ లుక్ పోస్టర్ టోన్ సూపర్ క్రేజ్ వచ్చేలా చేశాడు కార్తీక్ సుబ్బరాజు. పిజ్జాతో మొదలైన కార్తీక్ సుబ్బరాజు డైరక్షన్ మూవీస్ రజినీకాంత్ పెట్ట సినిమాతో సత్తా చాటాడు. విక్రమ్ తో పాటుగా ధృవ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. సినిమా ప్రీ లుక్ పోస్టర్ తోనే ఓ ఇంటెన్సిటీ కలుగచేసిన కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాతో విక్రమ్, ధృవ్ ఇద్దరికీ సూపర్ హిట్ ఇచ్చేలా ఉన్నాడు. 

 

ధృవ్ మొదటి సినిమా ఆదిత్య వర్మ పర్వాలేదు అనిపించుకుంది. తెలుగులో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను తమిళంలో ఆ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశయ్య డైరెక్ట్ చేశారు. కొన్నాళ్లుగా కెరియర్ లో సక్సెస్ లు లేని విక్రమ్ కూడా ఈ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా పోస్టరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. సినిమా మాత్రం అంచనాలను అందుకుంటే తప్పకుండా తండ్రి కొడుకులు ఇద్దరు హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయమని చెప్పొచ్చు.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: