టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే అందరు ముందు దిల్ రాజు పేరే చెప్తారు. ఒక సినిమా ఆడుతుందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పగలిగే టాలెంట్ దిల్ రాజు కి ఉండటం గొప్ప విషయం. ఈ టాలెంట్ తోనే ఎన్నో సినిమాలు తను నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా చేసిన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించాయి. ఇండస్ట్రీలో చాలా మంది ఒక సినిమా జడ్జెమెంట్ లో దిల్ రాజు సలహా తీసుకుంటారంటే ఆయన మీద ఇండస్ట్రీ వాళ్ళకి ఉన్న నమ్మకం ధీమా ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

 

అయితే గత కొంతకాలంగా దిల్ రాజు టైం చాలా బ్యాడ్ గా నడుస్తోంది. అందరూ నమ్మిన తన జడ్జెమెంటే తప్పటడుగు వేస్తోంది. ఆయన నిర్మించిన సినిమాలు గాని డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు గాని అంతగా సత్తా చాటలేకపోతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇదే పరిస్థితి అని చెప్ప వచ్చు. ఇక ప్రస్తుతం దిల్ రాజు పవర్ స్టార్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సరిగ్గా నెలరోజులు పని చేస్తే థియోటర్స్ లోకి తీసుకు వచ్చేయచ్చు. కాని ఇప్పట్లో థియోటర్స్ లో బొమ్మ పడని పరిస్థితి. 

 

ఇక నాని నటించిన వి కూడా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. మంచి బేరం కుదిరితే ధైర్యం చేసి ఓటీటీలో రిలీజ్ చేసేయొచ్చు. కాని థియోటర్స్ సంఘాల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే థియోటర్స్ లో రిలీజ్ చేసినా ఓటీటీలో రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, నాని వి హిట్ అయితే మాత్రం దిల్ రాజు గట్టెక్కేస్తాడు. లేదంటే కష్టమే. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడున్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దిల్ రాజు ని ఆదుకునేది పవన్ కళ్యాణ్ ..నాని సినిమాలే అని అర్థమవుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: