నందమూరి బాలకృష్ణతో కథ ఓకే చేయించడం చాలా ఈజీ అన్న టాక్ ఇండస్ట్రీలో ఇప్పటి నుండో వినిపిస్తుంది. ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధం అనే బాలకృష్ణ కొన్నాళ్ళు మూస ధోరణిలో సినిమాలు చేసినా బోయపాటి శ్రీను సింహా సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరచగా.. ఆ తర్వాత వచ్చిన రూలర్ కూడా డిజప్పాయింట్ చేయడంతో మళ్ళీ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ.

 

సినిమా తర్వాత బి.గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో యువ హీరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. తేజా డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా రాబోతున్న సినిమా అలివేలు వెంకటరమణ. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే తేజా ఈ కథ బాలకృష్ణ కోసం రాసుకున్నాడట.. బాలకృష్ణతో ఈ సినిమా చేద్దామని అనుకోగా ఎన్టీఆర్ బయోపిక్ తన ముందు పెట్టాడట బాలకృష్ణ. అయితే ఆ ప్రాజెక్ట్ నుండి తేజా మధ్యలోనే బయటకు వచ్చాడని తెలిసిందే.

 

తేజా గోపీచంద్ కాంబోలో వచ్చే సినిమా అలివేలు వెంకటరమణ బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథే అని ఫిల్మ్ నగర్ టాక్. కొన్నాళ్ళుగా సినిమాలైతే చేస్తున్నా సరైన సక్సెస్ లేని గోపీచంద్ మళ్ళీ తేజా మీద నమ్మకం పెట్టుకుని సినిమా చేస్తున్నాడు. తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం, నిజం సినిమాల్లో గోపీచంద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. విలన్ గా సక్సెస్ అయ్యి తిరిగి హీరోగా సినిమాలు చేశాడు గోపీచంద్. మరి తేజ ఈసారి అతన్ని హీరోగా పెట్టి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.               

 

మరింత సమాచారం తెలుసుకోండి: