అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించిన నదియా కు ఆ సినిమా తర్వాత వచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె అక్కడి నుంచి మంచి నటిగా పైకి రావాలి అని చూసారు. అగ్ర హీరోలతో సినిమాలు చేసిన ఆమెకు ఆ సినిమా బాగానే పేరు తీసుకొచ్చింది. అక్కడి నుంచి కూడా ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు మంచి మంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేసారు. 

 

ఇక అది అలా ఉంటే ఆమె మాత్రం వచ్చిన పేరు ని ఎక్కువ కాలం పాటు నిలబెట్టుకోలేదు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అనవసరంగా తన స్థాయిని ఎక్కువగా ఊహించుకుని ఆమె ఎక్కువగా డిమాండ్ చేసింది అని అది ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది అని లేకపోతే ఆమె తెలుగు సినిమాలలో ఎక్కువగా కనపడే వారు అని చాలా మంది వ్యాఖ్యానించారు. ఆమెకు ఆ సినిమా ద్వారా చాలా మంచి పేరు వచ్చింది అనే మాట వాస్తవం. అయితే ఆమె మాత్రం చాలా వరకు లెక్కలేని విధంగా వ్యవహరించి ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. 

 

ఇప్పుడు ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు అనేది వాస్తవం. అవకాశాలు వచ్చిన సమయంలో వాటిని ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ఆమె ప్రవర్తించారు అని అన్నారు. అనవసరంగా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడం కూడా ఆమె కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టిన అంశం అని చాలా మంది కామెంట్ కూడా చేసారు. ఆమెకు సలహాలు ఇచ్చినా సరే ఆమె అప్పుడు తీసుకోలేదని కొందరు వ్యాఖ్యలు కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: