నందమూరి బాలక్రిష్ణ  60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 10వ తేదిన పుట్టినరోజు జరుపుకుంటున్న బాలయ్య షష్టిపుర్తి కంప్లీట్ చేసుకోనున్నాడు. అయితే బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందడి స్టార్ట్ చేసారు. ఇప్పటికే బాలయ్య కామన్ డిస్ ప్లే పిక్ఛర్ ని ట్రెండ్ చేసారు. అయితే బాలయ్య పుట్టినరోజున నాలుగు సర్ప్రైజ్ లు ఉండనున్నాయని సమాచారం.

 

 

మొదటగా వార్తల్లో వస్తున్నట్టుగా బాలయ్య పాట సాయంత్రం 5గంటల 30 నిమిషాలకి రిలీజ్ కానుంది. ఈ పాటని అభిమానులకి ఇచ్చే గిఫ్ట్ గా అభివర్ణిస్తున్నారు. గతంలో స్టేజీ మీద పాటలు పాడిన బాలయ్య పైసావసూల్ చిత్రంలోనూ తన గొంతుకని వినిపించాడు. ఈ సారి అభిమానుల కోసం మరో మారు గొంతు విప్పాడు. అదొక్కటే కాదు ఇంకా బాలయ్య మీద సింగర్స్ పాడిన స్పెషల్ సాంగ్ కూడా ఉందట.

 

 

సింగర్ సింహాతో కలిపి మరికొంత మంది బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని పాట పాడారు. ఆ పాట కూడా రేపే రిలీజ్ కానుంది. మూడవ సర్పైజ్ ఏంటంటే, బాలయ్య బోయపాటి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి చిన్నపాటి టీజర్ రిలీజ్ కానుందట. ఇప్పటి వరకూ పూర్తయిన షెడ్యూల్ లోని చిన్నపాటి డైలాగ్ తో ఈ టీజర్ ఉంటుందని అంటున్నారు.

 

 

ఇక చివరగా బాలయ్య నర్తనశాల సినిమా నుండి చిన్నపాటి వీడియో క్లిప్ ని రిలీజ్ చేస్తారట. అప్పుడెప్పుడో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నుండి స్పెషల్ వీడియోని తయారు చేసారట. మొత్తానికి 60 వసంతంలోకి అడుగుపెడుతున్న బాలయ్య అభిమానుల కోసం చాలా సర్ప్రైజెస్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సర్ప్రైజెస్ అన్నింటినీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి బాలయ్య అభిమానులు రెడీగా ఉన్నారు. మరి అభిమానుల సందడి ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: