యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లో చివరి హిట్ గా నిలిచిన సినిమా లౌక్యం. అప్పట్లో ఫార్ములా బేస్డ్ సినిమాలు ఎక్కువగా ఆడేవి. లౌక్యం కూడా ఫక్తు ఫార్ములా బేస్డ్ కమర్షియల్ చిత్రం కావడంతో గోపీచంద్ కి హిట్ లభించింది. ఈ సినిమా ద్వారా గోపీచంద్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు పరాజయం చవిచూశాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీ మార్ సినిమా చేస్తున్న గోపీచంద్, తనకి మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడు తేజ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ కాబోతున్నాడు.

 

 

అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ తో తేజ స్క్రిప్టు సిద్ధం చేసాడు. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనేదే తేజకి పెద్ద ఛాలెంజిగా మారింది. మొదటగా ఈ సినిమాలో అలివేలుమంగ గా నటించడానికి కాజల్ అయితే బాగుంటుందని భావించాడట. కానీ కాజల్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటన్నింటినీ పూర్తి చేసి రావడానికి చాలా టైమ్ పడుతుంది.

 

 

అందుకే మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు. అనుష్క పేరు వినిపించినప్పటికీ అది గాలివార్తే అని సమాచారం. అదీగాక లేడీ ఓరియంటెడ్ సినిమాల్నే ఎంచుకుంటున్న అనుష్క గోపీచంద్ సరసన హీరోయిన్ గా చేస్తుందా అన్నది పెద్ద సందేహం. అందుకే ఆమెని పక్కన పెట్టేసి రకుల్ ప్రీత్ అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. గతంలో గోపీచంద్, రకుల్ జంటగా లౌక్యం సినిమాలో కనిపించారు.

 

 

సినిమా మంచి విజయం అందుకుంది కూడా. మరి మళ్ళీ ఆ కాంబినేషన్ ని రిపీట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అదీగాక్ రకుల్ కి తెలుగులో అవకాశాలే లేవు. కాబట్టి అలివేలుమంగగా చేయడానికి ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది. మరి డైరెక్టర్ తేజ ఎవరిని తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: